అంతర్జాతీయం

జర్దారీ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 16: పాకిస్తాన్‌లోని అవినీతి వ్యతిరేక కోర్టు శుక్రవారం దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి నకిలీ బ్యాంకు ఖాతాల కేసులో విధించిన జ్యుడీషియల్ రిమాండ్‌ను మూడు రోజు లు పొడిగించింది. ఒక మీడియా కథనం ఈ విషయం వెల్లడించింది. అకౌంటబిలిటి కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ బషీర్ ఎదుట 64 ఏళ్ల జర్దారీని హాజరు పరచగా, న్యాయమూర్తి జర్దారీని మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోసం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపించారు. ఈ కేసుకు సంబంధించి కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని, అందువల్ల జర్దారీ జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించాలని అంతకు ముందు నేషనల్ అకౌంటబిలిటి బ్యూరో ప్రాసిక్యూటర్ ముజఫర్ అబ్బాసి న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో న్యాయమూర్తి జర్దారీ జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించారని డాన్ వార్తాపత్రిక తెలిపింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కోచైర్మన్ అయిన జర్దారీని తిరిగి ఈ నెల 19న అకౌంటబిలిటి కోర్టులో హాజరు పరుస్తారు. తన క్లయింట్ ఇప్పటికే 90 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారని జర్దారీ తరపు న్యాయవాది సర్దార్ లతీఫ్ ఖోసా కోర్టుకు తెలిపారని జియో టీవీ పేర్కొంది.