అంతర్జాతీయం

కాశ్మీర్‌పై చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 15: జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను మోదీ సర్కారు రద్దు చేయడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతున్నది. ఈ వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తానంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేసిన 24 గంటల్లోనే చైనా నుంచి స్పందించడం, కాశ్మీర్ సమస్యపై తక్షణమే ఆంతరంగిక, రహస్య చర్చ జరపాలని భద్రతా మండలిని కోరడం జరిగిపోయాయి. ఇది చాలా కీలకమైన అంశమని, ప్రపంచ దేశాలు స్పందించాలని, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతూ పాకిస్తాన్ భద్రతా మండలికి రాసిన లేఖను చైనా ప్రస్తావించింది.
కాశ్మీర్‌పై భారత సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల భారత ఉపఖండంలో ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతున్నదని పాక్ చేస్తున్న వాదనతో చైనా ఏకీభవించింది. అందుకే, వెంటనే సమావేశమై, కాశ్మీర్ సమస్యను చర్చించాలని భద్రతా మండలిని కోరింది. చైనా ప్రతిపాదనకు భద్రతా మండలి సానుకూలంగా స్పందించిందని, శుక్రవారం సమావేశం కానుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ ఉన్నతాధికారి పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. ఇలావుంటే, భద్రతా మండలి అధ్యక్షురాలు జొన్నా వ్రొనెకాను ఉటంకిస్తూ, శుక్రవారం భద్రతా మండలి సమావేశం జరుగుతుందని, అందులో ప్రధాన ఎజెండాగా కాశ్మీర్ అంశమే ఉంటుందని జియో న్యూస్ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నదని పాకిస్తాన్ ఆరోపిస్తున్నది. అంతర్జాతీయ సమాజంతో ముడిపడి ఉన్న కాశ్మీర్‌పై భారత్ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటుందని పాక్ ప్రశ్నిస్తున్నది. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ చాలాకాలంగా పాక్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, అత్యంత కీలక సమస్యలను చర్చించే భద్రతా మండలి హడావుడిగా సమావేశం కావాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాశ్మీర్ సమస్యపై మండలి సభ్యులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిని రేపుతున్నది. భారత్‌కు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే, చైనా తనకు ఉన్న వోటో అధికారంతో దానిని బుట్టదాఖలు చేయడం ఖాయం. మొత్తం మీద భద్రతా మండలిలో జరగబోయే చర్చ ఏ దిశగా సాగుతుంది? ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? పాక్‌కు అనుకూలంగా మండలిలోని సభ్య దేశాలను చైనా ఏ విధంగా ఒప్పించగలుగుతుంది? వంటి అనేక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.