అంతర్జాతీయం

అంతర్జాతీయ స్థాయిలో తేల్చుకుంటాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 14: కాశ్మీర్ అంశాన్ని అంత తేలిగ్గా వదిలి పెట్టమని, అంతర్జాతీయ స్థాయిలో తేల్చుకుంటామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిజ్ఞ చేశారు. భారత్-పాక్‌ల మధ్య ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే అందుకు ప్రపంచ దేశాలదే బాధ్యత అని ఖాన్ అన్నారు. జమ్మూ-కాశ్మీర్‌కు రాజ్యాంగంలో కల్పించిన 370-అధికరణను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. దీనిని జీర్ణించుకోని పాక్ అక్కసు వెళ్ళగక్కతున్నది. భారత ప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన అంశంపై చర్చించేందుకు ముజఫరాబాద్‌లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకె) లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్వరంతో ప్రసంగిస్తూ నిప్పులు చెరిగారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ దేశాలు వౌనంగా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఒకవేళ భారత్-పాక్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైతే అందుకు అంతర్జాతీయ సమాజమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కన్ను కాశ్మీర్‌పై, పాక్‌పైనే ఉందన్నారు. దీనిని అంత తేలిగ్గా వదిలి పెట్టే ప్రసక్తి లేదని, తాను ఒక రాయబారిగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క ఫోరం ముందుకూ తీసుకెళతానని ఆయన చెప్పారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘వ్యూహాత్మక తప్పిదం’ చేశారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లకు స్వయం ప్రతిపత్తి తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంతో ‘కొత్త శకం’ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రపంచంలోని ముస్లింలంతా ఐక్యరాజ్య సమితి వైపు చూస్తున్నారని అన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ నివారణకు ప్రపంచ దేశాలన్నీ చర్యలు చేపట్టాలని ఖాన్ కోరారు. పీవోకె వైపు భారత్ ఎటువంటి అడుగులు వేసినా, తిప్పి కొట్టాల్సిందిగా ఈ సందర్భంగా సైనిక దళాలకు సందేశం ఇస్తున్నానని, మీ చర్యలకు తమదే బాధ్యత అని ఆయన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ప్రధాని మోది ఏమన్నారంటే..
ఇలాఉండగా రాజ్యాంగంలో కల్పించిన 370-అధికరణ వల్ల వేర్పాటువాదం తప్ప మరేమీ లేదని ప్రధాని మోది లోగడ విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో అవినీతి, కుటుంబ పాలనకు ఆస్కారం ఏర్పడిందని ఆయన దుయ్యబట్టారు.
ఇదే అవకాశంగా భావించిన పాక్ తరచూ కాశ్మీర్‌ను సాధనంగా మార్చుకుందని, సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయని విమర్శించారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం ద్వారా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు చరమగీతం పాడి, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని, శాంతి-భద్రతలు సంపూర్ణంగా ఉంటాయని ఆయన తెలిపారు.