అంతర్జాతీయం

కరాచీలో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఆగస్టు 14: భారీ వర్షాలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఒక్క కరాచీలోనే 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదల తీవ్రతకు కరాచీలోని వేర్వేరు ప్రాంతాల్లో కనీసం 42 మంది మరణించినట్లు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. శనివారం నుంచి పడుతున్న వర్షాలకు కనీసం 24మంది చనిపోగా.. వర్ష సంబంధిత ఘటనలతో 46మందికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు.
సింధ్ రాష్ట్రంలో కనీసం 28మంది మరణించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జూలై ఆఖరు నుంచి పడుతున్న వర్షాలు, వరదల తీవ్రతకు కనీసం 42 మంది మృత్యువాత పడినట్లు కరాచీ మేయర్ వాసిం అక్తర్ విలేఖరులకు చెప్పారు. వర్షాల నేపథ్యంలో అనేక మంది విద్యుదాఘాతంతో మృతి చెందారని ఆయన పేర్కొన్నారు. దీనిపై బాధితుల తరఫున తాను పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు మేయర్ వివరించారు. విద్యుత్ శాఖ అస్తవ్యస్త విధానాల కారణంగానే పరిస్థితి భయానకంగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని చెప్పారు. విద్యుదాఘాత మరణాలకు నేరుగా విద్యుత్ శాఖే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కరాచీ డిఫెన్స్ హౌసింగ్ అథారిటీలో రెండు రోజుల క్రితం విద్యుదాఘాతంతో తన ముగ్గురు స్నేహితులు చనిపోయారన్నారు. డీజిల్ జనరేటర్ నుంచి వెలువడిన పొగలను పీల్చి నలుగురు మృత్యువాత పడ్డారని ఏధి సంక్షేమ ట్రస్ట్‌కు చెందిన అధికారి చెప్పారు. కరాచీలో గత 24 గంటల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఎక్కడ చూసినా వర్షం నీరు ఏరులై పారింది. ప్రజలను నానా అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోలేకపోయారు. వర్షాల తీవ్రత మరింతగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఒక్క కరాచీలో 158 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.