అంతర్జాతీయం

ఒప్పందం లేని బ్రెగ్జిట్ ప్రజలను వంచించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 14: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి (బ్రెగ్జిట్) సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుంటే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బ్రిటన్ ప్రజలను వంచించడమే అవుతుందని దేశ మాజీ ఆర్థిక మంత్రి ఫిలిప్ హామండ్ పేర్కొన్నారు. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ బ్రెగ్జిట్‌కు సంబంధించిన చర్చలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. బోరిస్ జాన్సన్ జూలై 24న థెరిసా మే నుంచి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని గంటల ముందు హామండ్ చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు. బ్రెగ్జిట్ కోసం ఒప్పందం కుదుర్చుకోవద్దని ప్రజలు కాని, పార్లమెంటు కాని తీర్పు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌లోని అధిక శాతం మంది ప్రజలు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఒక క్రమపద్ధతిలో బయటకు రావాలని తీర్పు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ‘బ్రెగ్జిట్ కోసం ఒప్పందం కుదుర్చుకోకుంటే 2016లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడయిన ఫలితానికి ద్రోహం చేయడమే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు’ అని హామండ్ ‘ద టైమ్స్’ వార్తాపత్రికలో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఒకవేళ అలా జరిగితే, బ్రిటన్ క్షీణించిన, ఇతరుల బాధ్యత తీసుకోనటువంటి చిన్న ఇంగ్లాండ్‌లాగా మారిపోతుంది’ అని హామండ్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ అప్పటి ప్రధానమంత్రి థెరిసా మే చర్చలు జరిపి కుదుర్చుకున్న ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ మూడుసార్లు తిరస్కరించింది. బ్రిటన్ అక్టోబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సి ఉంది. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అదే తేదీన బ్రిటన్ వైదొలగుతుందని కొత్త ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ స్పష్టంగా ప్రకటించారు. అయితే, ఒప్పందం కుదుర్చుకోకుండా బ్రిటన్ వైదొలగితే, యునైటెడ్ కింగ్‌డమ్ సమగ్రతకు విఘాతం వాటిల్లుతుందని హామండ్ హెచ్చరించారు. ఉత్తర ఐర్లాండ్‌లో శాంతి ఒప్పందాలకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.