అంతర్జాతీయం

అమెరికాలో భారత విద్యార్థికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 14: 66 కంప్యూటర్లను ధ్వంసం చేసిన నేరానికి అమెరికాలో భారత విద్యార్థి విశ్వనాథ్ ఆకుతోటకు న్యూయార్క్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత మరో ఏడాదిపాటు అతనిపై నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. న్యూయార్క్‌లోని సెయింట్ రోజ్ యూనివర్సిటీ విద్యార్థి అయిన విశ్వనాథ్ మితిమీరిన చార్జింగ్ పెట్టడంతో 66 కంప్యూటర్ల సీపీయూలు, మానిటర్లు, ఇతరత్రా పరికరాలు ధ్వంసమయ్యాయి. పదే పదే ఓవర్ చార్జింగ్ చేయడం, ఆ వెంటనే వాటిని డిశ్చార్జి చేయడం వంటి చర్యలకు పాల్పడడంతో యూనివర్సిటీకి 58,471 డాలర్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న నార్త్‌కరోలినాలో పోలీసులు విశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అతను జైలులోనే ఉన్నాడు.