అంతర్జాతీయం

చైనా దూకుడుకు కళ్లెం వేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఆగస్టు 14: భారత్‌తో రక్షణ అలాగే హిందూ మహా సముద్రం విషయంలోనూ వ్యూహాత్మకంగా పని చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. హిందూ మహాసముద్రంలోకి చైనా విపరీతంగా చొచ్చుకు వస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా రక్షణ మంత్రి లిండా రెనాల్డ్స్ ఈ ప్రకటన చేశారు. పెర్త్‌లో జరిగిన 3వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ ఇండో-పసిఫిక్2 కాన్ఫరెన్స్‌లో ఆమె ప్రసంగించారు. హిందూ మహాసముద్రం విషయంలో ఇరుదేశాలు ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాలి అని అన్నారు. నౌకా రంగం అలాగే సముద్ర వాణిజ్యం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లిండా పేర్కొన్నారు. అయితే చైనా దూకుడుకు కళ్లెం వేయాలని ఆమె అన్నారు. 3భారత్ ఓ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. సమర్ధవంతమైన నాయకత్వంలో తిరుగులేని దేశంగా రూపుదిద్దుకుంది2అని లిండా స్పష్టం చేశారు. హిందూ మహా సముద్రంలో చైనా చర్యలు అభ్యంతకరంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. 2017లో దిజిబౌటీలో ఏకంగా మిలిటరీ స్థావరం ఏర్పాటు చేసిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చైనా తీరు ఇరు దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆమె చెప్పారు. 3మన హక్కులు, ప్రయోజనాలను హరించే చర్యలను తిప్పికొడదాం. దీనిపై భారత్, ఇండోనేసియా కలిసి రావాలి2అని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. పదేళ్లుగా భారత్- ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందాయని ఆమె ప్రకటించారు.