అంతర్జాతీయం

కొత్త పోరాటమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 13: కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలితో పాటు ముస్లిం ప్రపంచం మద్దతు పొందడానికి కొత్త పోరాటం చేయటానికి ముందుకు రావాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
జమ్మూకాశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తి హోదాను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రతా మండలి, ముస్లిం ప్రపంచం మద్దతు కూటగట్టడం పాకిస్తాన్‌కు అంత సులభం కాదని ఆయన ప్రజలకు వివరించారు.
అందువల్ల పాకిస్తాన్ ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించకుండా భద్రతా మండలి, ముస్లిం ప్రపంచం తమకు మద్దతిస్తాయని భ్రమపడకూడదని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ముజఫరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు వాస్తవ పరిస్థితిని తెలుసుకోకుండా భ్రమల్లో జీవించకూడదు. (భద్రతా మండలిలో) ఎవరు కూడా పూలమాలలు చేతిలో పట్టుకొని నిలబడి ఉండరు.. అక్కడ మీకోసం ఎవరూ ఎదురుచూస్తూ ఉండరు’ అని ఖురేషి అన్నారు.
రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించడం అనేది తన అంతర్గత విషయమని భారత్ ఇదివరకే అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. వాస్తవ పరిస్థితిని గ్రహించాలని పాకిస్తాన్‌కు కూడా హితవు పలికింది. జమ్మూకాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమయిన రష్యా తిరస్కరించింది. జమ్మూకాశ్మీర్ హోదా, దానిని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ చేసిన మార్పులు భారత దేశ రాజ్యాంగం పరిధిలోని అంశాలని, ఈ వాస్తవాల ఆధారంగానే తాను ముందుకెళ్తానని రష్యా విదేశాంగ శాఖ శుక్రవారం స్పష్టంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖురేషి మాట్లాడుతూ ఏ ముస్లిం దేశం పేరెత్తకుండా ఇస్లామిక్ సమాజం కూడా తమ ఆర్థిక ప్రయోజనాల రీత్యా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వకపోవచ్చని అన్నారు.
‘ప్రపంచంలోని వివిధ దేశాలకు వాటి స్వప్రయోజనాలు ఉన్నాయి. భారత్ వంద కోట్లకు పైగా జనాభా ఉన్న మార్కెట్. మనం తరచుగా ‘ఉమ్మాహ్’, ‘ఇస్లాం’ గురించి మాట్లాడుతూ ఉంటాం. కాని, ‘గార్డియన్స్ ఆఫ్ ఉమ్మాహ్’ (ఇస్లామిక్ సమాజం) కూడా అక్కడ (భరత్‌లో) పెట్టుబడులు పెట్టడం జరిగింది. వారి స్వప్రయోజనాలు వారికి ఉన్నాయి’ అని ఖురేషి అన్నారు.