అంతర్జాతీయం

విభేదాలు వివాదాలు కాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 12: ద్వైపాక్షిక విభేదాలు వివాదాలుగా మారకూడదని చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ స్పష్టం చేశారు. ఈ విభేదాల నివృత్తికి చర్చల ద్వారా ప్రయత్నాలు జరగాలే తప్ప అవి వివాదాలుగా మారేందుకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనార్థం చైనా వచ్చిన జయశంకర్ ఆ దేశ నాయకత్వంతో విస్తృత చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను తాము లోతుగా గమనిస్తున్నామని, దాని పర్యవసానాలపై కూడా దృష్టి పెట్టామని వ్యాఖ్యానించిన నేపథ్యంలో జయశంకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రాంతీయ శాంతి సుస్థిరతల పరిరక్షణకు భారత్ నిర్మాణాత్మకంగా కృషిచేయాలని ఈ సందర్భంగా చైనా అభ్యర్థించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా భావిస్తున్న ఉపాధ్యక్షుడు వాంగ్ కిషాన్‌తో జయశంకర్ సోమవారం సమావేశమయ్యారు. అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తో కూడా ప్రతినిధుల స్థాయిలో పరిమిత చర్చలు సాగించారు. జయశంకర్‌కు స్వాగతం పలికిన చైనా విదేశాంగ మంత్రి భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలను ప్రస్తావించడంతోపాటు పరోక్షంగా 370 అధికారణం రద్దు అంశాన్ని స్పృశించారు. శాంతియుత సహజీవనాన్ని పెంపొందించే పంచశీల సూత్రాల ప్రాతిపదికగా పరస్పర ప్రయోజనం కలిగించుకునే రీతిలో సంబంధాలు కొనసాగించాలని, దీనిద్వారానే ఉభయ దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడమే కాకుండా ప్రపంచ శాంతికి, మానవ ప్రగతికి దోహదం చేయగలుగుతాయని వాంగ్ ఈ సందర్భంగా అన్నారు. అలాగే అతి పెద్ద దేశాలైన భారత్, చైనా ప్రాంతీయ శాంతి సుస్థిరతలను కాపాడే విషయంలో గురుతర భూమికను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని ఆయన ఉద్ఘాటించారు. భారత్‌తో రెండోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విదేశాంగ మంత్రిగా చైనాలో అడుగుపెట్టిన జయశంకర్ పర్యటనకు అనేక కోణాల్లో ప్రాధాన్యత చేకూరింది. కాశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయంపై చైనా మొదట్లో తీవ్రంగా ప్రతిఘటించడం.. దాన్ని భారత్ తిరస్కరించడం ఈ పర్యటన ప్రాముఖ్యతను పెంచింది. అయితే వివాదాల జోలికి పోకుండా సంయమన రీతిలోనే పరస్పర సంబంధాలను పెంపొందించుకోవాలన్ని దృష్టితోనే తాజా పర్యటన సాగుతోంది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య రెండో శిఖరాగ్ర భేటీకి సంబంధించి కూడా ఈ సందర్భంగా చైనా నాయకత్వంతో జయశంకర్ చర్చించనున్నారు. పరస్పర అవసరాలను గుర్తించి వాటి అనుగుణంగా మెలిగినప్పుడే భారత్, చైనాల దౌత్య సంబంధాలు ఆధారపడి వుంటాయని జయశంకర్ అన్నారు. సోమవారం భారత్, చైనా ప్రజా సంబంధాల ప్రతినిధుల స్థాయి సమావేశం లో ఆయన మాట్లాతారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచం లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భార త్, చైనాల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు అవకాశాల గురించి చైనా నాయకత్వంతో చర్చించడం ఎంతో ప్రయోజనకరమన్నారు.