అంతర్జాతీయం

చైనాతో జైశంకర్ కీలక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 11: ద్వైపాక్షిక విషయాలతోపాటు అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చైనా నాయకత్వంతో చర్చించేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆదివారం బీజింగ్ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో చైనా అధ్యక్షుడు లీ జిన్ పింగ్ రెండో శిఖరాగ్ర భేటీకి న్యూఢిల్లీ వచ్చే అంశంపై కూడా జైశంకర్ చర్చించే అవకాశం ఉంది. భారత్‌లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ పర్యటనకు రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత చేకూరింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌కు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక హోదాను మోదీ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో జరుగుతున్న జైశంకర్ పర్యటన మరింత ప్రాధాన్యతతో కూడుకున్నదేనని విశే్లషకులు భావిస్తున్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దుకు చాలా ముందుగానే జైశంకర్ చైనా పర్యటన ఖరారైంది. 2009 నుంచి 2011 వరకు ఆయన చైనాలో భారత రాయబారిగా పనిచేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. అయితే, ఎవరెవరితో జైశంకర్ సమావేశం అవుతారన్నది ప్రస్తుతానికి స్పష్టం కానప్పటికీ ఆయన అధికారిక కార్యకలాపాలు సోమవారంనాడు తెలుస్తాయి. ముఖ్యంగా సాంస్కృతిక, ప్రజా సంబంధాలను పెంపొందించే అంశంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ ఈతో జైశంకర్ ద్వైపాక్షిక భేటీ జరుపుతారు. గత ఏడాది మొదటిసారిగా ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ జరిపే చర్చల్లో జీ జిన్‌పింగ్ భారత్‌కు సంబంధించిన అనేక అంశాలు ఖరారవుతాయని చెబుతున్నారు. అలాగే, వాణిజ్య లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చించే అవకాశం కనిపిస్తోంది. కాశ్మీర్‌కు హోదా రద్దయిన తర్వాత చైనా విడివిడిగా చేసిన రెండు ప్రకటనల ప్రభావం కూడా జైశంకర్ పర్యటనపై ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని చైనా వ్యతిరేకించింది. అలాగే కాశ్మీర్ పరిణామాలపైనా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, చైనా వ్యాఖ్యలను తిరస్కరించిన భారత్ కాశ్మీర్ వ్యవహారం తమ ఆంతరంగికమని తేల్చిచెప్పింది.