అంతర్జాతీయం

ఆంక్షలు బేఖాతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, ఆగస్టు 10: హాంకాంగ్‌లో చైనా వ్యతిరేక ర్యాలీలు కొత్త మలుపు తిరిగాయి. ఆందోళనకారులను తీవ్ర స్థాయిలో అణచివేయాలన్న ఆదేశాల నేపథ్యంలో ఆంక్షలను సైతం ధిక్కరించి ప్రజలు వేల సంఖ్యలో శనివారం కూడా ప్రదర్శన జరిపారు.
తాజా ర్యాలీని రద్దు చేయాలని అధికారులు ఆదేశించినా ఏమాత్రం ఖాతరు చేయకుండా వీధుల్లోకొచ్చిన నిరసనకారులపై పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. దాంతో దాడులు జరిపి, పరారయ్యే రీతిలో ఆందోళనకారులు కొత్త వ్యూహాన్ని అనుసరించినట్టు స్పష్టమవుతోంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో బయటకు రాకుండా ఆందోళనకారులు చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి నగరమంతా విస్తరించారని, ఓ నిర్ణీత స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక నినాదాలు చేశారని అధికారులు తెలిపారు. చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడ్డ వ్యక్తులు ముందుగా పోలీసుల అనుమతి కోరారని, అందుకు వారు నిరాకరించడంతో దాడికి పాల్పడి వెంటనే అదృశ్యమైపోయారని పేర్కొన్నారు. ఆ విధంగా అనేకచోట్ల పోలీసులతో దాడులకు పాల్పడినట్టు కూడా కథనాలు వెలువడుతున్నాయి. పోలీసులతో ముఖాముఖి తలపడకుండానే వారికి ఎంత తీవ్ర స్థాయిలో సమస్యలు సృష్టించాలో అంతగానే సృష్టిస్తామని ఓ 17 ఏళ్ల విద్యార్థి తెలిపాడు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఆందోళనలు మొదలై ఇది 10వ వారం. హాంకాంగ్ తీసుకువచ్చిన నేరస్తుల మార్పిడి బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యవాదులు ఈ నిరసనలను మొదలుపెట్టారు.