అంతర్జాతీయం

బీజింగ్‌లో భీకర తుఫాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 10: ఈశాన్య చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో శనివారంనాడు సంభవించిన భారీ తుఫాన్ దాటికి 18 మంది మరణించగా, మరో 14 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని సంబంధిత ప్రభుత్వ వర్గాల అధికార మీడియా వెల్లడించింది. గంటకు 187 కిలోమీటర్ల వేగంతో లేకిమా టైఫూన్ తుఫాన్ గాలులు వీచినట్టు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ తరహా తుఫాన్‌లు రావడం ఇది తొమ్మిదోసారి. శనివారంనాడు సంభవించిన తుఫాన్‌తో జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెన్‌లింగ్ సిటీతోపాటు, యాంగ్‌జియా కౌంటీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతి 10 నిమిషాలకు 10 మీటర్ల ఎత్తున దాదాపు 120 గ్రామాల్లో భీకరమైన గాలులు వీచాయని జిన్‌హువా అనే అధికార వార్తా ఏజన్సీ తెలిపింది. తొలుత గంటకు కేవలం 15 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు రానురాను ఉద్ధృతమై అతి భీకరంగా మారాయని నేషనల్ మెటరల్జికల్ సెంటర్ (ఎన్‌ఎంసీ) తెలిపింది. సహాయక చర్యల కోసం 300కు పైగా పోలీసు సిబ్బంది, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు జిన్‌హువా వార్త సంస్థ పేర్కొంది.