అంతర్జాతీయం

మా వైఖరి మారలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 9: జమ్మూ-కాశ్మీర్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, అయితే సమస్య ఉద్రిక్తతలకు దారితీయకుండా భారత్-పాకిస్తాన్‌లు సంయమనం పాటించి, ప్రత్యక్ష చర్చల ద్వారా విభేదాలను నివృత్తి చేసుకోవాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. మీడియాతో మాట్లాడిన అమెరికా విదేశాంగ ప్రతినిధి మోర్గాన్ ఓర్టాగస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని, సంబంధిత దేశాల్లో చర్చల ద్వారా దీనిని పరిష్కరించుకోవాలన్నది దీర్ఘకాలంగా తాము అనుసరిస్తున్న విధానమని ఆమె తెలిపారు. ఈ చర్చలు ఎలా జరపాలి? ఏ అంశాల ప్రాతిపదికన నిర్వహించాలన్నది పూర్తిగా భారత్-పాక్‌లకు నిర్ణయించుకోవాల్సిన అంశమని తెలిపారు. కాశ్మీర్‌పై అమెరికా వైఖరి మారి ఉంటే తాను ఈ సమావేశాన్ని ఏర్పాటు ఈ ప్రకటన చేసి ఉండేదానిని కాదని మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె తెలిపారు. త్వరలోనే అమెరికా విదేశాంగ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఢిల్లీ వెళ్తారన్న విషయాన్ని ఆమె వెల్లడించారు. శాంతి, సుస్థిరతలకు ఎలాంటి విఘాతం కలుగకూడదన్నది తమ అభిమతమని, భారత్-పాక్ నేరుగానే మాట్లాడుకుని సమస్యలు నివృత్తి చేసుకోవాలని తాము మొదటినుంచి కోరుతున్నామని అన్నారు. జమ్మూ-కాశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండడంతో అమెరికా, చైనా సహా పలు దేశాలు చర్చల మార్గమే శరణ్యమని ఇరు దేశాలకు సూచించాయి. పాకిస్తాన్ కొన్ని ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మరింతగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి మొదలైంది. కాగా, భారత నాయకత్వంతో అనేక అంశాలపై తాము చర్చిస్తున్నామని, అలాగే పాకిస్తాన్‌తో కూడా సన్నిహితంగా మెసలుతున్నామని ఓర్టాగస్ తెలిపారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలపై వ్యాఖ్యానించడానికి ఆమె నిరాకరించారు.
అంతర్జాతీయంగా ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చిన ఆయా దేశాలకు శాంతియువతంగా మెసలాలనే అమెరికా స్పష్టం చేస్తూ వస్తోందని వివరించారు. జమ్మూ-కాశ్మీర్ పరిస్థితిని లోతుగా తాము గమనిస్తున్నామని పేర్కొన్న ఆమె 370 అధికరణ రద్దుకు ముందు భారత్ తమను సంప్రదించలేదని వెల్లడించారు.