అంతర్జాతీయం

థార్ ఎక్స్‌ప్రెస్‌పైనా పాక్ గుర్రు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, ఆగస్టు 9: కాశ్మీర్ పరిణామాలు భారత్-పాక్‌ల మధ్య మరింత వేడిని పెంచుతున్న దాఖలాలు స్పష్టమవుతున్నాయి. వాఘా సరిహద్దు వద్ద సంఝూతా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సేవలను నిలిపివేసే నేపథ్యంలో తాజాగా దీని ప్రభావం థార్ ఎక్స్‌ప్రెస్‌పైనా పడే అవకాశం కనిపిస్తోంది. రాజస్తాన్ సరిహద్దు ద్వారా ఈ రైలు భారత్-పాక్‌లను కలుపుతుంది. జోథ్‌పూర్‌లోని భగత్తీ కోఠి స్టేషన్ నుంచి కరాచీకి ప్రతి శుక్రవారం ఈ రైలు వెళ్తుంది. 2006లో ఈ రైలు సర్వీసు పునరుద్ధరణ జరిగింది. కాగా, థార్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసే అంశానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సర్వీసులో అనిశ్చితి నెలకొంది. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ వస్తున్న పాక్ థార్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును కూడా అడ్డుకునే అవకాశం ఉందన్న కథనాలు తీవ్రమవుతున్నాయి. దాదాపు 41 సంవత్సరాలపాటు నిలిచిపోయిన తర్వాత 2006లో పునఃప్రారంభమైన థార్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యానికి వారథిగా కొనసాగుతూ వస్తోంది. సంఝూతా ఎక్స్‌ప్రెస్‌ను వాఘా సరిహద్దు వద్ద భద్రతా కారణాల సాకుతో గురువారం పాక్ అధికారులు నిలిపివేశారు. గత 13 సంవత్సరాల్లో థార్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 4 లక్షల మంది ప్రయాణించినట్టుగా అంచనాలు వెలువడుతున్నాయి.