అంతర్జాతీయం

జల దిగ్భంధంలో మైన్మార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వెగిన్ (మైన్మార్), ఆగస్టు 8: భారీ వర్షాలు, వరదలతో మైన్మార్ అతలాకుతలమయింది. లక్షలాది మంది ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత స్థలాలకు తరలిస్తున్నారు. స్వెగిన్‌లోని టౌన్‌షిప్ దాదాపుగా మునిగిపోయింది. వరద నీరు పోటెత్తడంతో ఎన్నో ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. సిటియూంగ్ నది పోటెత్తడంతో అనేక గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. అత్యవసర సర్వీసు సిబ్బంది రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న పడవలను వేసుకొని స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ప్రాణ నష్టం జరిగినట్టు మైన్మార్ ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే దేశ వ్యాప్తంగా 30 వేల మంది నిరాశ్రయులు అయ్యారని, వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామని ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.