అంతర్జాతీయం

జన్యుమార్పిడితో మానవ కాలేయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 7: శాస్తజ్ఞ్రులు తొలిసారి జన్యు మార్పిడి ప్రక్రియ ద్వారా ప్రయోగశాలలో చిన్న పరిమాణంలో గల మానవ కాలేయాలను అభివృద్ధి చేశారు. మనుషుల్లో కాలేయ వ్యాధులు ఎందుకు వస్తాయి, అవి ఎలా తీవ్రమవుతాయి అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆ వ్యాధులను నయం చేయడానికి ఇచ్చే వైద్య చికిత్స, ఔషధాలను పరీక్షించడానికి ఈ చిన్న మానవ కాలేయాలు ఉపయోగపడతాయని శాస్తజ్ఞ్రులు తెలిపారు. అమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ పిట్స్‌బర్గ్‌కు చెందిన శాస్తజ్ఞ్రులు జన్యురచన చేసిన మానవ కణాలను క్రియాత్మక, త్రిమితీయ (3డీ) కాలేయ కణజాలంగా పరివర్తన చేశారు. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)ను సోకి ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా కాలేయంలో కొవ్వు పెరుగుతుంది. ఇలా కొవ్వు పెరగడం కాలేయం సంకోచించడానికి దారితీస్తుంది. కాలేయం ఇలా సంకోచించే వ్యాధినే కిర్‌హోసిస్ అంటారు. ఈ వ్యాధి కారణంగా కాలేయం పనిచేయడం ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ‘ప్రయోగశాలలో మూల కణాలను ఉపయోగించి జన్యుమార్పిడి ద్వారా వ్యాధి కలిగిన చిన్న పరిమాణంలోని మానవ కాలేయాలను తయారు చేయగలగడం ఇదే తొలిసారి’ అని యూనివర్శిటి ఆఫ్ పిట్స్‌బర్గ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అలెజాండ్రో సోటో-గుటియెర్రెజ్ తెలిపారు. కిర్‌హోసిస్ వ్యాధి రావడానికి గల కారణాలు, ఆ వ్యాధి ఎలా ముదురుతుంది అనే విషయాలను అవగాహన చేసుకోవడమే కాకుండా వైద్య చికిత్సలను పరీక్షించడానికి ఈ చిన్న మానవ కాలేయాలు ఉపయోగపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాలు ‘సెల్ మెటబాలిజం’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.