అంతర్జాతీయం

జమ్మూ-కాశ్మీర్ వ్యవహారం భారత దేశ అంతరంగికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 7: జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చుకోవడం భారత దేశ అంతరంగిక వ్యవహారం అని అమెరికాలోని భారత రాయబారి తెలిపారు. రాజ్యాంగంలోని 370-అధికరణ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌కు ఇప్పటి వరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించాయి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అంతర్జాతీయ దేశాలకుగానీ లేదా భారత దేశ సరిహద్దు దేశాలకు గానీ ఎటువంటి ఆటంకం, నష్టం లేదని అమెరికాలోని భారత రాయబారి హర్ష వర్దన్ సింగాలా వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. జమ్మూ-కాశ్మీర్‌లో సుపరిపాలన, ప్రజల సామాజిక, ఆర్థిక లాభాలు కల్పించడం వంటి ఎనె్నన్నో కేంద్రం కల్పించనున్నదని ఆయన వివరించారు. పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా జమ్మూ-కాశ్మీర్‌లో సొంతంగా అసెంబ్లీ, కౌన్సిల్‌లు ఏర్పాటవుతాయన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల భారత్‌కు పొరుగు దేశాలకు మధ్య ఉన్న నియంత్రణ రేఖలకు విఘాతం కలగదని ఆయన ఒక పౌరుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమెరికా-్భరత్‌ల మధ్య ఉన్న సంబంధాలూ చెక్కుచెదరవని ఆయన తెలిపారు. విదేశీ విధానంలో మార్పు ఉండదన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కాశ్మీర్, లడఖ్ ప్రజలకు ఇకమీదట ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా అందుతాయని ఆయన తెలిపారు. ఆర్థికంగా అవి నిలదొక్కుకుంటాయని, పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగంలోని 35-ఏ, 370-అధికరణను రద్దు చేయడం ద్వారా పెట్టుబడులు లభిస్తాయని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లో శాంతి-్భద్రతలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఇంకా నియంత్రణ రేఖల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తుందని హర్షవర్దన్ సింగాలా తెలిపారు.