అంతర్జాతీయం

‘ఆఫ్గాన్ అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కబూల్: ఆఫ్గనిస్తాన్‌లో వచ్చే నెలలో జరిగే ఎన్నికలను బహిష్కరించాలని తాలిబన్లు మంగళవారం నాడిక్కడ పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల ర్యాలీలకు ప్రజలు దూరంగా ఉండాలంటూ హుకుం జారీ చేసింది. గత ఎన్నికల్లో సాయుధ తాలిబన్లు, వారి మద్దతుదార్లు వరుస దాడులకు పాల్పడిన క్రమంలో తాజా హెచ్చరికలు ప్రజాల్లో భయాందోళనలు రేకెత్తించాయి. ఇప్పటికే ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో తీవ్ర స్థాయి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశాధ్యక్షుడిని ఎనుకునేందుకు సెప్టెంబర్ 28న ఎన్నికలు జరుగనున్నాయి. ఐతే ఇందుకు సంబంధించిన ప్రక్రియలో ఆరంభంలోనే ప్రతిఘటన ఉదంతాలు చోటుచేసుకోవడంతో ప్రచారంలో స్తబ్ధత నెలకొంది. పలువురు అభ్యర్థులు ఇప్పటి వరకు ప్రచారాన్ని ఆరంభించలేదు. ఈక్రమంలో పోలింగ్ తేదీ మళ్లీ వాయిదాపడే అవకాశాలున్నాయని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. తాలిబన్లతో అమెరికా శాంతి చర్చలు జరిపేందుకు వీలుగా ఇప్పటికే ఈ పోలింగ్ రెండు దఫాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐతే ఎన్నికల బహిష్కరణపై తమ వైఖరిని మార్చుకునేది లేదని తాజాగా తాలిబన్లు స్పష్టం చేశారు. దీంతో మళ్లీ వరుస దాడులు తప్పవన్న విషయం స్పష్టం కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ‘నష్టాలను నివారించేందుకు గతంలో జరిగిన మా సహచరుల బలిదానాలకు బాసటగా నిలవాలి. అలాగే ఎన్నికల ర్యాలీలు ప్రచార సభలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరే మా ప్రధాన లక్ష్యం అవుతారు.’ అంటూ తాలిబన్ వెబ్‌సైట్‌లో పోస్టుచేసిన మెస్సేజ్ పేర్కొంది. 2014లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు పూర్తిస్థాయి అవినీతి ఆరోపణలకు గురైన క్రమంలో అసలు ఆఫ్గనిస్తాన్ అధ్యక్ష ఎన్నికలకు ఏ విలువా లేదని తాలిబన్లు ఆ సంక్షిప్త సమాచారంలో వ్యాఖ్యానించారు.