అంతర్జాతీయం

మీరు ఊబకాయులా..? ఐతే జాగ్రత్త సుమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఆగస్టు 5: ‘మీరు ఊబకాయులా, ఐతే జాగ్రత్త సుమా!’ అని పరిశోధకులు హెచ్చరించారు. ఊబకాయులకు గుండె పోటు, మ, మధుమేహం (డయాబెటీస్), క్యాన్సర్, నరాల (న్యూరాలోజికల్), కండరాల, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయని తెలిపారు. యూకె, బయోబ్యాంక్ తాజాగా శరీర ద్రవ్యరాశి సూచికపై చేసిన పరిశోధనను లానె్సట్ డిజిటర్ హెల్త్ జర్నల్ ప్రచురించింది. ఊబకాయం ఉన్న వారిపై నిర్వహించిన పరిశోధనల్లో అనేక విషయాలు స్పష్టమైనట్లు జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో పేర్కొంది. ఊబకాయం వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండెపోటు, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా ప్రొఫెసర్ ఎలీనా హైప్పొనెన్ పేర్కొన్నారు. ఊబకాయులు అనేక మంది ముఖ్యంగా మధుమేహంతో బాధ పడుతున్నారని ఆయన తెలిపారు. ఇంకా ఎక్కువగా పరిధీయ నరాల రుగ్మతలు, గ్యాంగ్రెనె, కాళ్ళకు పుండ్లు ఏర్పడడం, కిడ్నీ పాడైపోవడం వంటి రకరకాల వ్యాధులు వస్తాయని తమ బృందం పరిశీలనలో స్పష్టమైందని ఆయన వివరించారు. ఊబకాయుల్లో ఏకకాలంలో అనేక వ్యాధులు ఉండడాన్ని పరిశీలించి తగ్గించడం, రక్తపోటును ఎప్పటికప్పుడు పరిశీలించడం, డయాబిటీస్‌ను నిరోధించడం ఇతరత్రా ఉన్న సమస్యలను నియంత్రించడం అన్నది అత్యంత కీలకం అని తెలిపారు. జన్యు పరిశోధనలు కూడా చేశామని, వీటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. అందరు స్థూలకాయుల్లో బరువు పెరగడాన్ని అరికట్టడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జన్యుపై ఇంకా లోతైన అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.