అంతర్జాతీయం

ఆందోళనకారులపై బాష్పవాయు ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, ఆగస్టు 4: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులు వరుసగా రెండో రోజు ఆదివారం సాయంత్రం కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రహదారుల దిగ్బంధానికి పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు భద్రతా బలగాలతో ఘర్షణలకు దిగారు. దీంతో రియోట్ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మరోవైపు, హాంకాంగ్‌లో ఆందోళనకారులు సృష్టిస్తున్న అశాంతిపై చైనా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. షెయుంగ్ వాన్ జిల్లాలో పోలీస్ లైన్స్ వైపు దూసుకెళ్తున్న ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. సబ్‌వేలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఒక కొత్త ప్రదేశంలోకి కూడా చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా ఆదివారం ప్రచురించిన కొత్త వ్యాఖ్యలు తాజా అశాంతికి కారణమయ్యాయి. దుష్ట శక్తులు దేశానే్న బెదిరిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం ఊరకే చూస్తూ కూర్చోదని జిన్హువా పేర్కొంది. ఆదివారం నాటి ఘర్షణల కారణంగా పోలీసులు రెండు వందల మందికి పైగా ఆందోళకారులను అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, అవసరమయితే, అశాంతిని అణచివేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చైనా సైన్యం ప్రకటించింది.

చిత్రం...ఆందోళనకారులపై బాష్పవాయు ప్రయోగం