అంతర్జాతీయం

పడవలు మునిగి 31 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, ఆగస్టు 4: ఫిలిప్పీన్స్‌లో మూడు బల్లకట్టు పడవలు మునిగిన ప్రమాదాల్లో మృతుల సంఖ్య 31కి పెరిగింది. రెండు సెంట్రల్ ఫిలిప్పీన్ రాష్ట్రాల్లో ప్రచండ గాలులు, అలల కారణంగా మూడు బల్లకట్టు పడవలు మునిగిపోయిన ప్రమాదంలో సహాయక సిబ్బంది ఆదివారం కల్లోల సముద్ర జలాల నుంచి మరో మూడు మృతదేహాలను బయటకు తీశారు. దీంతో ఈ ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 31కి పెరిగింది. శనివారం గుయిమరస్, లోయిలో రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వీచిన ప్రచండ గాలులు, తీవ్రమయిన అలల కారణంగా రెండు బల్లకట్టు పడవలు నీట మునిగాయని, మృతుల్లో ఎక్కువ మంది వీటిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులేనని కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి బాలిలో తెలిపారు.
62 మంది ఇతర ప్రయాణికులు, సిబ్బందిని రక్షించినట్టు ఆయన వివరించారు. లోలియో రాష్ట్రంలో మరో బల్లకట్టు పడవ కూడా మునిగిపోయిందని, అయితే అందులో ప్రయాణికులు ఎవరూ లేరని, అయిదుగురు సిబ్బందిని రక్షించినట్టు ఆయన తెలిపారు. తాము ప్రయాణం మధ్యలో ఉండగా, అకస్మాత్తుగా ఆకాశం నల్లబడిందని, ప్రచండ గాలులతో కూడిన వర్షం కురిసిందని, దాంతో తమ పడవలు అదుపు తప్పి మునిగిపోయాయని ఈ ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.