అంతర్జాతీయం

అమెరికాలో నరమేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ హ్యూస్టన్ (అమెరికా), ఆగస్టు 4: అమెరికాలో మరోసారి ‘గన్ కల్చర్’ విషం కక్కింది. రెండు వేర్వేరు సంఘటనల్లో 30 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్ పాసో (టెక్సాస్)లోని వాల్‌మార్ట్‌లో శనివారం 21 ఏళ్ల యువకుడు కాల్పులకు తెగించాడు. తన వద్ద ఉన్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో 20 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు. మృతుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పురుషులు, స్ర్తిలు, పిల్లల శవాలు పడి ఉన్నాయని ఎల్ పాసో పోలీస్ చీప్ గ్రెగ్ అలెన్ ప్రకటించారు. వీకెండ్ కావడంతో పిల్లలతో కలిసి వచ్చిన కొనుగోలుదారులతో వాల్‌మార్ట్ కిక్కిరిసిపోయి ఉన్న సమయంలో ఆగంతకుడు హఠాత్తుగా కాల్పులకు దిగాడు. ఎలాంటి హెచ్చరికలుగానీ, ముందస్తు సమాచారంగానీ లేకపోవడంతో, మృతుల సంఖ్య పెరిగిందని గ్రెగ్ అలెన్ తెలిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని డల్లాస్‌కు చెందిన పాట్రిక్ క్రూసస్‌గా గుర్తించినట్టు చెప్పారు. అతనిని అదులోకి తీసుకున్నామని అన్నారు. కేసు నమోదైందని, విచారణ కూడా మొదలుపెట్టామని వివరించారు. ఇలావుంటే, పబ్‌లు, నైట్‌క్లబ్‌లు, బార్లు, ఆర్ట్ గ్యాలరీలు, దుకాణ సముదాయాలకు పేరుపొందిన డేటన్‌లో ఓ వ్యక్తి హఠాత్తుగా జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. పోలుసుల కాల్పుల్లో ఆ వ్యక్తి కూడా మృతి చెందాడు.
దీనితో మృతుల సంఖ్య పదికి పెరిగింది. ఈ రెండు వరుస సంఘటలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయకులపై కాల్పులు జరిపి, వారిని హతమార్చడం వల్ల ఎవరూ, ఏమీ సాధించలేరని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ప్రజలను చంపడంలో ఔచిత్యం ఏముందో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సంఘటనలను పిరికిపందల చర్యగా అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని అన్నారు. మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి మార్సెలో ఎబ్రార్‌డ ఒక ప్రకటనలో ఎల్ పాసో సంఘటన దురదృష్టకరమైనదని వ్యాఖ్యానించారు. మృతుల్లో ఆరుగురు తమ దేశ పౌరులు ఉన్నారని తెలిపారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన వారిలో రెండేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల ముదుసలి వరకూ ఉన్నారని ఎల్ పాసో మెడికల్ యూనివర్శిటీ అధికార ప్రతినిధి ర్యాన్ మిల్కే తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని అన్నారు.