అంతర్జాతీయం

జాదవ్‌ను కలిసేందుకు మరింత జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 3: పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత రిటైర్డ్ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు భారత హైకమిషన్ అధికారులు చేసిన ప్రయత్నాలు శనివారం వరకు ఫలించలేదు. 49 ఏళ్ల జాదవ్‌ను 2017 ఏప్రిల్‌లో టెర్రరిజం, గూఢచర్యం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై పాకిస్తాన్ మిలటరీ కోర్టు జైలుతోపాటు ఉరిశిక్ష విధించింది. అయితే, జాదవ్‌కు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ కోర్టును (ఐసీజే)ను భారత్‌ను ఆశ్రయించి, తన వాదనలను పూర్తిస్థాయిలో వినిపించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు జూలై 17న ఆ ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసుపై సమర్థవంతంగా సమీక్ష, పునఃపరిశీలన చేయాలని పాక్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా జైలులో ఉన్న కుల్‌భూషణ్ జాదవన్ కలిసేందుకు ఎలాంటి జాప్యం లేకుండా న్యాయవాదిని అనుమతించాలని కూడా సూచించింది. ఇదిలావుండగా, దౌత్యవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ న్యాయస్థానం సూచించిన విధంగా జైలులో ఉన్న జాదవన్‌ను కలిసేందుకు న్యాయవాదిని అనుమతించాలని భారత్ పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, కొన్ని పరిమితుల మేరకు, పాక్ అధికారుల సమక్షంలోనే న్యాయవాది కుల్‌భూషణ్‌ను కలిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. ఇందుకు అనుగుణంగా జాదవ్‌ను న్యాయవాది కలిసేందుకు పాకిస్తాన్ ఫారిన్ ఆఫీస్ సైతం శుక్రవారంనాడు అనుమతి మంజూరు చేసింది. అయినా శనివారం వరకు జాదవ్‌ను తమ భారత్ తరఫున లాయర్ కలిసేందుకు అనుమతి ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది.