అంతర్జాతీయం

చకచకా ‘కర్తార్‌పూర్’ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 3: అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని నారోవల్ జిల్లాలో నిర్మిస్తున్న కర్తార్ కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. జీరో లైన్ నుం గురుద్వార్ సాహెబ్‌ను కలుపుతూ కారిడార్ రూపొందుతోంది. నవంబర్‌లో జరిగే గురునానక్ 550వ జయంతి ఉత్సవాలకు కారిడార్‌ను సిద్ధం చేసి ప్రారంభోత్సం చేయాలని భావిస్తున్నారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ నుంచి భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ ప్రార్థనాలయాన్ని కలిపేలా కారిడార్ నిర్మిస్తున్నారు. ఇరుదేశాల సిక్కుమతస్తులు స్వేచ్ఛగా రాకపోకలు జరిపేందుకు కారిడార్‌కు రూపకల్పన చేశారు. గురునానక్ దేవ్ 1522లో కర్తార్‌పూర్ సాహెబ్‌ను సందర్శించారు. ఇలా ఉండగా కారిడార్ ప్రారంభమయితే నవంబర్ 9న భారత్ నుంచి తొలి బ్యాచ్ పాక్‌కు చేరుకుంటుంది. అయితే తొలి బ్యాచ్‌లో ఎంత మంది ఉంటారన్న విషయంపై స్పష్టత లేదు. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం కర్తార్‌పూర్ కారిడార్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. మెయిన్ రోడ్డు, వంతెన, భవనాల నిర్మాణం దాదాపుపూర్తి కావచ్చింది. పాకిస్తాన్ వైపుఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తయ్యాయి. బాబా గురునానక్ జయంతి సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా కారిడార్‌ను ప్రారంభిస్తారని ట్రిబ్యూన్ వెల్లడించింది. ఇరుదేశాల మధ్య రాకపోకలకు సంబంధించి సాంకేతిక నిపుణుల కమిటీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, పాక్‌లోని కర్తార్‌పూర్‌ను కలుపుతూ కారిడార్ నిర్మాణానికి సంబంధించి 2018 నవంబర్‌లో ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. సిక్కులు వీసా అవసరం లేకుండానే కర్తార్‌పూర్ సందర్శించేందుకు వెసులుబాటు ఉంది. పాక్-్భరత్ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నారోవాల్ అనే చిన్నపట్టణంలో కర్తార్‌పూర్ సాహెబ్ నెలకొంది. గురునానక్ 18 సంవత్సరాలు ఇక్కడ గడిపినట్టు చెబుతారు.