అంతర్జాతీయం

హెచ్చరికలు బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, ఆగస్టు 3: హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులు చైనా హెచ్చరికలను ధిక్కరించి శనివారం తమ నిరసన కార్యక్రమాలను తీవ్రం చేశారు. శనివారం సాయంత్రం అంతా వారు ఒక ప్రాచుర్యం పొందిన షాపింగ్, పర్యాటక జిల్లా అయిన ట్సిమ్ షా ట్సుయిలో రోడ్లపై తాత్కాలిక బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న అశాంతి పట్ల చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆందోళనకారులు వాటిని లెక్కచేయలేదు. హాంకాంగ్‌లోని నేరస్థులను మెయిన్ ల్యాండ్ చైనాకు అప్పగించడానికి ఉద్దేశించిన ఒక ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకిస్తూ రెండు నెలల క్రితం ఈ ఆందోళనలు మొదలయ్యాయి. సదరు చట్టం ప్రతిపాదనను అధికారులు ఉపసంహరించుకున్నప్పటికీ ఆందోళనలు ఆగలేదు. ప్రజాస్వామ్య సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ కొనసాగుతున్నాయి. దీంతో చైనాలోని సెమీ అటానమస్ ప్రాంతమయిన హాంకాంగ్ అధికారులు, చైనా అధికారులు ఆందోళనల పట్ల కఠిన వైఖరిని అవలంబించనున్నట్టు సంకేతాలు పంపించారు. హాంకాంగ్‌లో సహించరాని అశాంతిని అణచివేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చైనా సైన్యం కూడా ప్రకటించింది. కాని, ప్రదర్శకులు ఈ హెచ్చరికలను లెక్కచేయలేదు. వచ్చే వారం పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటామని, ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో హాంకాంగ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చిత్రం...శనివారం జరిగిన ర్యాలీకి తరలివచ్చిన జనం