అంతర్జాతీయం

మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడుని వెనక్కి పంపిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్యుటికొరిన్ (టీఎన్)/న్యూఢిల్లీ, ఆగస్టు 3: మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆద్హీబ్ అబ్దుల్ గఫూర్‌ను భారత అధికారులు తిరిగి ఆ ద్వీపానికి పంపించారు. అబ్దుల్ గఫార్ భారత్‌ను రాజకీయ ఆశ్రయాన్ని కోరుతున్నారు. మాల్దీవుల నుంచి గురువారం గఫార్ తొమ్మిది మంది సిబ్బందితో కలిసి కార్గో నౌకలో ట్యుటికొరిన్‌కు చేరుకున్నారు. అయితే గఫార్ వద్ద సరైన ధృవపత్రాలు లేకపోవడంతో అధికారులు అభ్యంతరం తెలిపారని, దీంతో వారిని అదే కార్గొ నౌకలో శుక్రవారం రాత్రి ఆ ద్వీపానికి వెనక్కి పంపించినట్లు పోలీసులు చెప్పారు. మాల్దీవుల ద్వీపంలో గఫార్‌కు ప్రాణ హాని ఉన్నందున రాజకీయ ఆశ్రయాన్ని కోరారని ఆయన తరఫు యూకె న్యాయవాది తెలిపారు. గఫార్ వద్ద సరైన ధృవ పత్రాలు లేనందున ఆ ద్వీపానికి వెనక్కి పంపించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. గఫార్‌ను నిర్బంధించలేదని, అరెస్టు చేయలేదని అధికారులు వివరించారు. మీడియా కథనాలను వారు తోసిపుచ్చారు.