అంతర్జాతీయం

హాంకాంగ్‌లో సడలని ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, జూలై 31: హాంకాంగ్‌లో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగడంతో ఉద్రిక్తత ఏమాత్రం తగ్గడంలేదు. ఏవైనా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారిని విచారణ నిమిత్తం చైనాకు పంపాలన్న ప్రభుత్వ నిర్ణయం హాంకాంగ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. ఇలావుంటే, బుధవారం కోర్టు 44 మందికి తలా 10 సంవత్సరాల వంతున జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న ఆరోపణలతో వీరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజలను రెచ్చగొట్టి, హింసాత్మక ఉద్యమాలకు బీజం వేస్తున్నారని వీరిపై ప్రాసిక్యూషన్ ఆరోపణలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత 44 మందికి జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కాగా, అరెస్టులు, శిక్షలు ఒకవైపు కొనసాగుతుంటే, మరోవైపు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. బుధవారం కూడా హాంకాంగ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.