అంతర్జాతీయం

రోదసిలో మరో మూడు కొత్త గ్రహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 30: అంతరిక్ష శోధనలో శాస్తవ్రేత్తలు ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు సాగిస్తూనే ఉన్నారు. మన సౌర వ్యవస్థనే కాకుండా, దాని ఆవల ఉన్న రోదసీ లోతుల్లోకి వెళ్లి అనేక కొత్త గ్రహాలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా భూమికి 73 కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న మూడు కొత్త గ్రహాలను కనిపెట్టారు. విశ్వలోతుల్లోకి వెళ్లి కొత్త గ్రహాలను అనే్వషించేందుకు నాసా కొనే్నళ్లుగా కృషి ఫలితంగానే సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఈ మూడు కొత్త గ్రహాల ఉనికిని కనిపెట్టగలిగామని శాస్తవ్రేత్తలు తెలిపారు. ఈ మూడింటిలో ఒక గ్రహం భూమి కంటే పెద్దదని, మిగతా రెండు మన భూమికి పరిమాణంలో రెండింతలు ఉన్నాయని ఈ రెండూ కూడా వాయుమయమేనని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. కొత్త గ్రహాలను అనే్వషించేందుకు నాసా ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్‌ను ప్రయోగించింది. అనుకున్నట్టుగానే ఈ ఉపగ్రహ సంకేతాలు మూడు కొత్త గ్రహాల ఉనికిని తెరపైకి తెచ్చాయని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ మూడు గ్రహాలు భూమికి 73 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయని, అవి మనకు సమీపంలో ఉన్నట్టే లెక్క అని పరిశోధకులు తెలిపారు. మన సౌర వ్యవస్థ పరిధి లక్ష కాంతి సంవత్సరాలని, ఇందులో ఉన్న లక్షలాది నక్షత్ర మండలాల్లో మనది కూడా ఒక్కటని శాస్తవ్రేత్త కేన్ తెలిపారు. దీనిని బట్టి చూస్తే ఈ మూడు గ్రహాలు 73 కాంతి సంవత్సరాల దూరంలోని ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయంటే మన పొరుగున ఉన్నట్టేనని తెలిపారు.