అంతర్జాతీయం

నేపాల్‌ను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్మండూ, జూలై 15: వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ను ఆదుకోవాలని అంతర్జాతీయ సంస్థలను ఇక్కడి ప్రభుత్వం అర్థిస్తోంది. భారీ వర్షాలతో దాదాపు 67మందికి పైగా ప్రజలు మృత్యువాతపడగా.. మరో 30మంది జాడ కనిపించకుండా పోయింది. నేపాల్‌లోని 25 జిల్లాల్లో వరదల్లో చిక్కుకొని అల్లల్లాడగా.. పదివేల 385 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం జాగ్రత్తలను తీసుకొంటోంది. నేపాల్‌లోని కేంద్ర, ఈశాన్య ప్రాంతాలపై వరదల ప్రభావం పడింది. కాట్మండూలోని చాలా ప్రాంతాలు సహా కాలంకి, కుపొండోల్, కులేశ్వర్, బల్కు ఇంకా నీటమునిగే ఉన్నాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. కాట్మండూ, లలిత్‌పూర్, దాదింగ్, రౌతాహిత్ తదితర ప్రాంతాల నుంచి దాదాపు 1445 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేపాల్ కార్యాలయ అధికారులు, యునిసెఫ్ ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి జనాభా నిధి, మరికొన్ని అంతర్జాతీయ సంస్థలతో నేపాల్ ప్రభుత్వం ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించింది. వరద బాధిత ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల్లో సహాయ చర్యలకు సహకరించి తగిన యంత్రాంగాన్ని పంపాల్సిందిగా అంతర్జాతీయ సేవా సంస్థలను కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన హెల్త్ ఎమర్జెన్సీ కేంద్రం అభ్యర్థించింది.
వరద ప్రాంతాల్లో ఆరోగ్య సహాయ చర్యలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు హెల్త్ ఎమర్జెన్సీ కేంద్రం ఇన్‌చార్జి చూడామణి భండారి పేర్కొన్నారు. కేంద్రం పరిధిలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఎమర్జెన్సీ బృందాలను పంపాల్సిందిగా కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

చిత్రం... నేపాల్‌లోని రోతక్ జిల్లా, గార్ వద్ద వరద నీటిలోనే తమతమ గమ్యాలకు వెళుతున్న ప్రజలు.