అంతర్జాతీయం

అర్థరహిత ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెహరాన్, జూన్ 25: అమెరికా తమపై తాజాగా విధించిన ఆంక్షల విషయంలో ఇరాన్ విరుచుకుపడింది. వీటిని అర్థరహితమైనవిగా, బుద్దిహీనమైనవిగా అభివర్ణించింది. ఇరాన్ సుప్రీం కమాండర్ అయాతుల్లా అల్ ఖైమేనీని లక్ష్యంగా చేసుకుని తాజాగా అమెరికా ఆంక్షలు విధించడం అన్నది దౌత్యపరమైన మార్గాలన్నింటినీ మూసివేయడంగా దేశాధ్యక్షుడు హసన్ రౌహానీ పేర్కొన్నారు. 80 సంవత్సరాల అయాతుల్లా ఖైమేనీకి అమెరికా వెళ్ళే ఉద్దేశ్యం గానీ, ఆలోచన గానీ లేదని, అలాంటి ఆయనపైనే అమెరికా ఆంక్షలు విధించడం చాలా తీవ్రమైన చర్య అని రౌహానీ అన్నారు. అమెరికా చర్యలను బట్టి చూస్తే వైట్ హౌస్‌కు మానసిక రుగ్మత సోకిందన్న భావన కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలపై ఇరాన్‌లో తలెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు రౌహానీ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. అయాతుల్లా ఖైమేనీపై అమెరికా విధించిన ఆంక్షలు నిరుపయోగమని, దీని వల్ల రెండు దేశాల మధ్య తదుపరి చర్చలకు మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు.