అంతర్జాతీయం

భారత్ సేవలు అపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మే 25: ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి, దాని శాంతి పరిరక్షక మిషన్లకు భారత్ అందించిన అపారమయిన సేవలకు గాను ఐరాస సెక్రటరి జనరల్ ఆంటోనియో గుటెరెస్ కృతజ్ఞతలు తెలిపారు. ఐరాస అంతర్జాతీయంగా శాంతి భద్రతలను నిర్వహించడంలో భారతీయ మహిళలు పోషించిన స్ఫూర్తివంతమయిన పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ మిషన్లకు భారత్ ఈ రోజు సుమారు 6,400 శాంతిపరిరక్షకుల సేవలను అందిస్తోందని గుటెరెస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐరాస శాంతిపరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐరాసలో భారతదేశ పర్మనెంట్ మిషన్ శుక్రవారం ప్రత్యేక తేనీటి విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఐరాస మిషన్లలో సేవలందించి తిరిగి రాని లోకాలకు వెళ్లిన వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుటెరెస్ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఐరాస ఆదర్శాలకు మద్దతుగా భారతీయ మహిళా, పురుష శాంతి పరిరక్షకులు చూపుతున్న అపారమయిన ధైర్య సాహసాలు, త్యాగాల స్ఫూర్తికి తాను అమితమయిన ప్రశంసలు, కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నానని అన్నారు.