అంతర్జాతీయం

మధ్యప్రాచ్యంలో అదనపు బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 25: ఇరాన్ తన ఆస్తులపై దాడి చేసే ప్రమాదం ఉండటంతో 1,500 అదనపు బలగాలను మధ్యప్రాచ్యంలో మోహరిస్తున్నట్టు అమెరికా తెలిపింది. అయితే, అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్య అంతర్జాతీయ శాంతికి ప్రమాదకరమని పేర్కొంది. ‘మా ప్రాంతంలో అమెరికా బలగాల ఉనికి పెరగడం తీవ్రమయిన ప్రమాదం. అంతర్జాతీయ శాంతికి ముప్పు’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావద్ జారిఫ్ పేర్కొన్నారని దేశ అధికార వార్తాసంస్థ ఇర్నా శనివారం తెలిపింది. అమెరికా ఆస్తులపై దాడి చేయాలని ఇరాన్ ప్రణాళిక రూపొందించిందని, అందువల్ల మధ్యప్రాచ్యానికి విమాన వాహక నౌకను, బీ-52 బాంబర్లను, అదనపు బలగాలను పంపించాలని అమెరికా ఈ నెల మొదట్లో నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల ఉనికి పెరుగుతోంది. అమెరికాకు మిత్రదేశం, ఇరాన్‌కు బద్ధ శత్రువు అయిన సౌదీ అరేబియాకు ఆయుధాల విక్రయంపై అమెరికన్ కాంగ్రెస్ విధించిన ఆంక్షలను తొలగించడానికి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ‘ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం ఉన్నందున దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమిది’ అని అమెరికా రక్షణ శాఖ మంత్రి పాట్రిక్ షానహన్ శుక్రవారం పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో అదనపు బలగాల మోహరింపునకు ఆమోదం తెలిపిన అధ్యక్షుడు ట్రంప్ ఈ చర్యను ‘రక్షణాత్మకమయినది’గా అభివర్ణించారు. ‘మాకు మధ్యప్రాచ్యంలో రక్షణ కావాలని కోరుకుంటున్నాం’ అని ట్రంప్ విలేఖరులతో అన్నారు.