అంతర్జాతీయం

మళ్లీ చర్చలు షురూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 21: పాక్‌కు చెందిన దౌత్యవేత్త మొయిన్ ఉల్ హక్ ఆ దేశం తరఫున భారత్‌లో కొత్త రాయబారిగా నియమితులయ్యారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయి, ఈనెల 23న ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో సంబంధ బాంధవ్యాలను మళ్లీ పునఃప్రారంభించేందుకు కొత్త రాయబారి నియామకం దోహదపడుతుందని పాక్ యోచిస్తోంది. భారత్‌తోపాటు, చైనా, జపాన్ దేశాలతోపాటు 12 డజన్లకు పైగా రాయబారుల నియామకానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోమవారంనాడు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పాకిస్తాన్ దేశం తరఫున రాయబారిగా వ్యవహరిస్తున్న మొయిన్ ఉల్ హక్‌ను భారత్ కొత్త రాయబారిగా నియమిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. హక్ ఇంతకుముందు విదేశీ కార్యాలయంలో చీఫ్ ప్రొటోకాల్‌గా సేవలు అందించారు. 1987లో పాకిస్తాన్ తరఫున ఫారిన్ సర్వీసులో చేరిన ఆయన టర్కీ, కెనడా, శ్రీలంక దేశాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ పోస్టు గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. సొహైల్ మహమ్మద్ భారత్‌లో పాక్ హైకమిషనర్‌గా పనిచేసి ఇటీవలే పాకిస్తాన్ కొత్త ఫారిన్ సెక్రటరీగా వెళ్లిపోవడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లో పాక్ హైకమిషనర్ పోస్టు ఖాళీ ఉండడం, ఈనెల 23 తర్వాత కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపడతుండడంతో తక్షణ అవసరం కింద మొయిల్ ఉల్ హక్ నియామకానికి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోమవారం జరిగిన ఒక సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.