అంతర్జాతీయం

మళ్లీ చమురు సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 22: ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపి వేయాలని లేని పక్షంలో తమ ఆంక్షలకు గురి కావాల్సి వస్తుందని అమెరికా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి భారత్, చైనాతో సహా ఐదు దేశాలకు స్పష్టమైన హుకుం జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఆ దేశంపై మళ్లీ కఠిన ఆంక్షలు విధించి ఏడాది పూర్తవుతున్న తరుణంలో అమెరికా ఈ తాజా ఆదేశాలకు పదును పెడుతున్నది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపి వేయాలని భారత్‌తో సహా ఐదు దేశాలను అమెరికా ఆదేశించడానికి గల కారణం దానిపై గరిష్ట స్థాయిలో వత్తిడి తీసుకుని రావాలన్న ఆలోచనేనని చెబుతున్నారు. గతంలో భారత్, చైనా, జపాన్‌తో సహా ఎనిమిది దేశాలకు 180 రోజుల తాత్కాలిక వెసులుబాటును అమెరికా కల్పించింది. దీనిని ఆసరగా చేసుకుని ఈ దేశాలు ఇరాన్ నుంచి చమురును తగ్గించిన పరిమాణంలో దిగుమతి చేసుకున్నాయి. తాజాగా పూర్తిగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపి వేయాలని ఈ దేశాలను కోరడం లేనిపక్షంలో ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడం చర్చనీయాంశమైంది. మే 2వ తేదీ నుంచి ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసవుకునే ఏ దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చే ప్రసక్తి లేదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌పాంపియో తెలిపారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌కు మినహాయింపు ఇవ్వడానికి కారణం ఒమన్ ఖాతంలో ఓ ఓడరేవు అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర వహించడమేని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్-చైనాలు ఇరాన్ నుంచి గరిష్ట స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా ఆదేశాలను ఈ దేశాలు ఖాతరు చేయని పక్షంలో వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.