అంతర్జాతీయం

శ్రీలంకలో ఎమర్జెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక ఆదివారం నాటి నరమేధ విషాదం లంకను దుఃఖసాగరంలో ముంచేసింది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో రాజధాని కొలంబో తల్లడిల్లింది. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, హోటళ్లే లక్ష్యంగా మొత్తం ఏడుగురు మానవ బాంబర్లు రక్తపాతం సృష్టించినట్టు అధికారులు నిర్థారించారు. ఆరుగురు భారతీయులు సహా మృతుల సంఖ్య 290కు పెరిగింది. స్థానిక మిలిటెంట్ సంస్థకు ఈ పేలుళ్లతో ప్రమేయం ఉందని చెబుతున్న అధికారులు 24మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ విధించారు. మంగళవారం సంతాప దినంగా పాటిస్తున్నారు.

చిత్రం... శ్రీలంకలోని సెయంట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన పేలుడు తీవ్రతను పరిశీలిస్తున్న భద్రతా దళ సిబ్బంది