అంతర్జాతీయం

అనాగరికం, అటవికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: శ్రీ లంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ ఘటనలు అనాగరికమైనవని, అటవిక చర్య అని ప్రపంచ దేశాల నేతలు పలువురు తీవ్రంగా ఖండించారు. ఆరు గంటల్లో 8 చోట్ల జరిగిన పేలుళ్ళలో 150 మందికి పైగా మృత్యువాత పడ్డారని, వీరిలో డజన్ల కొద్దీ విదేశీయులూ ఉన్నారు. ఇలాఉండగా బ్రిటీషు, డచ్, అమెరికా తదితర దేశాలు ఆ దేశ ప్రజలకు మద్దతు ప్రకటించాయి. ఆదివారం ఈస్టర్ రోజున చర్చిలు, హోటళ్ళు తదితర జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్ళ ఘటనలతో దిగడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. వరుస బాంబు పేలుళ్ళ ఘటనలతో తీవ్రంగా గాయపడిన వారిలో జపాన్ దేశీయులు కూడా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలను బ్రిటీష్ ప్రధాన మంత్రి థెరిసా తీవ్రంగా ఖండించారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి సానుభూతిని ప్రకటిస్తూ ‘ట్వీట్’ చేశారు. ఈ కష్ట కాలంలో ఆ దేశ ప్రజలకు అండగా నిలబడాలని ఆమె ప్రజలను కోరారు. డచ్ ప్రధాన మంత్రి మార్క్ రూఠె వరుస బాంబు పేలుడు ఘటనలను తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మెర్రిసన్ లంక ప్రజలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భయంకరమైన ఉగ్రవాదుల బాంబు పేలుడు ఘటనలతో నిర్మలంగా, అందంగా ఉండే లంక అతలాకుతలమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న అమాయక ప్రజలు బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూజిల్యాండ్ ప్రధాన మంత్రి జకిండా ఆర్డెమ్ కూడా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
చిత్రం...కొలంబోలో ఈస్టర్ సండే రోజు జరిగిన భారీ పేలుళ్లు.. ఆత్మాహుతి దాడులు బీభత్సం సృష్టించాయి. ప్రార్ధనా స్థలంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు