అంతర్జాతీయం

శారదా పీఠం కారిడార్‌కు పాక్ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 25: కర్తార్‌పూర్ కారిడార్‌కు అంకురార్పణ జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్-పాక్‌ల మధ్య మరో సుహృద్భావ శకానికి తెరలేచింది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న శారదా పీఠం కారిడార్ నిర్మాణ ప్రతిపాదనను పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. సామ్రాట్ అశోకుడి కాలంలో క్రీస్తు పూర్వం 237లో నిర్మితమైన అత్యంత ప్రాచీన విజ్ఞాన ఆలయ కేంద్రమిది. ఈ కారిడార్‌కు సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్‌కు భారత్ ప్రతిపాదన పంపింది. ‘కర్తార్‌పూర్ తర్వాత హిందువులకు ఇదో పెద్ద వార్త. శారదాపీఠం కారిడార్ ప్రతిపాదనను పాక్ ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు’అని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాల్ని ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుత సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టు పనులు మొదలవుతాయని, పాక్‌లోని హిందువులూ ఈ ఆలయాన్ని సందర్శించగలుగుతారని అధికార పిటిఐ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రమేష్ కుమార్ తెలిపారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఉమ్మడి చర్చల ప్రక్రియలోనే శారదా పీఠం కారిడార్ అంశం కూడా ఉందని భారత అధికార వర్గాలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి. ప్రజల మతపరమైన మనోభావాలను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రతిపాదన చేయడం జరిగిందన్నాయి. 5వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శారదా పీఠం ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్‌లో శిధిలావస్థలో ఉంది. చదువుల తల్లి సరస్వతికి అంకితమైన ఈ ఆలయం ప్రాచీన కాలంలో విజ్ఞాన కేంద్రంగా సుప్రసిద్ధం. ముఖ్యంగా ఆరు, పనె్నండో శతాబ్దాల్లో భారత ఉపఖండంలో ఆలయ విశ్వవిద్యాలయంగా భాసిల్లింది. అప్పట్లో జగత్ప్రసిద్ధమైన విజ్ఞాన మూడు కేంద్రాల్లో ఒకటి శారదా పీఠమైతే రెండోది అనంతనాగ్‌లోని మార్తాండ్ సూర్యాలయం కాగా మూడోది అమర్‌నాథ్ ఆలయం.