అంతర్జాతీయం

ముంచెత్తిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయపుర (ఇండోనేషియా), మార్చి 17: ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో ఆకస్మాత్తుగా సంభవించిన వరదల వల్ల 50 మంది ప్రజలు మరణించారు. కాగా ఈ విపత్తులో కొట్టుకుపోయిన వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించింది. తూర్పు ప్రొవిన్స్ రాజధాని జయపురకు సమీపంలోని సెంటాని నదికి వచ్చిన వరదల వల్ల ఈ విపత్తు వచ్చింది.
దీనికి తోడు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో 59 మంది ప్రజలు గాయపడ్డారు. ఈ వివరాలను అధికార ప్రతినిది పుర్వా నుగ్రోహో చెప్పారు. వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అదికారులు చెప్పారు. నదీ లోతట్టు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా మృతదేహాల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు ఎప్పారు. వరదల వల్ల చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో వరదలు కొత్త కాదు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య వరదలు వస్తుంటాయని అధికారులు చెప్పారు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన వరదల్లో 70 మంది చనిపోయారు. ఈ ప్రాంతాల్లో 17వేల దీవుల సమూహం ఉంది. ఇక్కడ భూకంపం, వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో జావా ద్వీపం వల్ల అగ్నిపర్వతం బద్ధలైంది. దీని వల్ల 400 మంది మరణించారు.
చిత్రం.. ఇండోనేషియాలోని పపువాలో సంభవించిన ఆకస్మిక వరదలకు కొట్టుకొచ్చిన ఓ విమానం