అంతర్జాతీయం

పరారీలో పాక్ మిలిటెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, మార్చి 17: పాకిస్తాన్‌లోని జమాత్-ఉద్-దవా (జేయూడీ), ఫలా-ఈ-ఇన్‌సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్) సంస్థలకు చెందిన పలువురు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర వత్తిడి వచ్చిన నేపథ్యంలో ఈ రెండు ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నిషేధం విధిస్తూ, ఈ సంస్థలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాక వందలాది మంది సభ్యులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో జేఈఎం చీఫ్ మసూద్ అజార్ కుమారుడు, సోదరుడు సైతం ఉన్నారు. దీంతో ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయ్యద్ మినహా పలువురు సభ్యులు, నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సయ్యద్ ప్రస్తుతం రాహోర్‌లోని తన నివాసంలో పటిష్ట భద్రత మధ్య సాధారణ జీవితం గడుపుతున్నాడు. నిషేధం నేపథ్యంలో జేయూడీ మీడియా బృందం సైతం అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వారు ఈ విషయంపై మీడియాకు ఎలాంటి ప్రకటనలు విడుదల చేయడం కాని, ఫోన్ కాల్స్ స్వీకరించడం కాని చేయడం లేదు. దీనిపై జేయూడీ మీడియా నేతలైన ముజాహిద్, అహ్మద్ నదీమ్‌లను సంప్రదించడానికి పీటీఐ ప్రయత్నించినా వారు స్పందించ లేదు. ఇలావుండగా రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా జేయూడీ హెడ్‌క్వార్టర్స్‌లో వారం వారం ఇచ్చే ప్రసంగం ఇవ్వడానికి సయ్యద్‌కు అనుమతి నిరాకరించారు.
కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రవాద దాడుల సూత్రధారి మసూద్ అజర్ 1994లో భారత్‌కు రావడానికి ముందు జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్ల కోసం విరాళాలు సేకరించడానికి వివిధ దేశాలలో పర్యటించాడు. షార్జా, సౌదీ అరేబియాలో అతనికి పెద్దగా స్పందన లభించనప్పటికీ, ఇంగ్లాండ్‌లో మాత్రం నెల రోజుల పాటు పాగా వేసి రూ. 15 లక్షలు (పాకిస్తాన్ కరెన్సీ) సేకరించాడు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడయిన అజర్ భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద దాడులకు బాధ్యుడు. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడికి, గత నెలలో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడికి అతడే సూత్రధారి. అజర్ తన అసలు పేరు, అసలు చిరునామాతో 1986లో పాకిస్తాన్ నుంచి పాస్‌పోర్ట్ పొందాడు. ఆఫ్రికా, గల్ఫ్ దేశాలలో విస్తృతంగా పర్యటించాడు. కాశ్మీర్ కోసం పోరాడుతున్న ఉగ్రవాదుల పట్ల అరబ్ దేశాలకు సానుభూతి లేదని ఈ పర్యటనలో అజర్ గ్రహించాడు. ఇక్కడి భద్రతా ఏజెన్సీల వద్ద ఉన్న అజర్ ఇంటరాగేషన్ రిపోర్ట్ ప్రకారం, అతను 1992 అక్టోబర్‌లో బ్రిటన్‌ను సందర్శించాడు. లండన్‌లోని సౌతాల్‌లో గల ఒక మసీదులోని ముస్లిం మత బోధకుడయిన ముఫ్తి సిమాయిల్.. అజర్ బ్రిటన్ పర్యటనకు అవసరమయిన అన్ని ఏర్పాట్లు చేశాడు. వాస్తవానికి గుజరాత్‌కు చెందిన సిమాయిల్ కరాచీలోని దారుల్ ఇఫ్తా వల్ ఇర్షద్‌లో చదువుకున్నాడు. ‘నేను యూకేలో ముఫ్తీ ఇస్మాయిల్‌తో కలిసి సుమారు నెల రోజుల పాటు ఉన్నాను. బర్మింగ్‌హామ్, నాటింగ్‌హామ్, బెర్లిన్, షెఫిల్డ్, డడ్స్‌బరి, లీసెస్టర్‌లలోని అనేక మసీదులను సందర్శించాను. కాశ్మీర్‌లోని మిలిటెంట్ల కోసం ఆర్థిక సహాయాన్ని కోరాను. నేను రూ. 15 లక్షలు (పాకిస్తాన్ కరెన్సీ) సేకరించగలిగాను’ అని అజర్ ఇంటరాగేటర్లకు చెప్పాడు. యూకేలోని ఇతర ముస్లిం నాయకులను కూడా అజర్ కలిశాడు. మంగోలియా, అల్బేనియాలలో మసీదులు, మదరసాల నిర్మాణ రంగంలో ఉన్న భారత సంతతికి చెందిన వౌలానా లామైల్ కూడా అజర్ కలిసిన వారిలో ఉన్నాడు. 1990వ దశాబ్దం తొలినాళ్లలో అజర్ సౌదీ అరేబియా, అబుధాబి, షార్జా, కెన్యా, జాంబియాలలో పర్యటించి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల కోసం నిధులు సేకరించాడు. అజర్ నిధుల సేకరణ కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్లాడు. ఇలాంటి సహాయాలు చేసే రెండు ప్రధాన ఏజెన్సీలను కలిసినప్పటికీ, నిధుల సేకరణలో విఫలమయ్యాడు.
చిత్రాలు.. హఫీజ్ సయాద్ *మసూద్ అజర్