అంతర్జాతీయం

మసీదుల్లో మారణహోమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్ట్‌చర్చ్, మార్చి 15: న్యూజిలాండ్‌లోని శుక్రవారం రెండు ప్రాంతాల్లోని మసీదుల్లో జరిగిన మారణ హోమంలో దాదాపు 49 మంది పౌరులు మరణించారు. ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 20 మందికిగా పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర హింసాత్మక ఘటనను న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ తీవ్రంగా ఖండిస్తూ దీనిని అసాధారణ హింసగా అభివర్ణించారు. కాల్పులకు తెగబడినట్టు అనుమానిస్తూ ఒక మహిళతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు మసీదుల్లో జరిగిన ఈ ఘోర హింసాకాండ ఇక్కడి వలసదారులు, శరణార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని దేశ ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని జసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ ‘శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు జరిపేందుకు వచ్చినవారిపై జరిగిన ఘటనను ఉగ్రవాద దాడిగా స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తూ ముగ్గురు వ్యక్తులతోపాటు ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రధాని తెలిపారు. మసీదుల్లో జరిగిన ఈ దుర్ఘటన దేశంలోని 5 మిలియన్ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె తెలిపారు. ఈ మారణకాండతో దేశ భద్రతా వ్యవస్థకు రెండోసారి ఎదురైన బెదిరింపుగా ప్రధాని అభివర్ణించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారెవరన్న దానిపై సంబంధిత అధికారులు బహిర్గతం చేయలేదు. 74 పేజీల యాంటీ ఇమ్మిగ్రెంట్ మేనిఫెస్టోతో మసీదులో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడని ఆ అధికారులు తెలిపారు. ఈ మారణ హోమానికి పాల్పడిన వ్యక్తిని ఆస్ట్రేలియాకు చెందిన 28 ఏళ్ల జాత్యహంకారం కలిగినవాడిగా పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ సైతం ధృవీకరిస్తూ మసీదుల్లో దారుణ మారణహోమానికి పాల్పడిన ఆ నలుగురు వ్యక్తులు తమ దేశ పౌరులని పేర్కొన్నారు. ఇదిలావుండగా పోలీస్ కమిషనర్ మైక్ బుష్ మాట్లాడుతూ శుక్రవారం రాత్రి హత్యాకాండకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురికి ఈ ఘటనతో సంబంధం ఉందో లేదో అన్న అంశంపై అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. కాగా, న్యూజిలాండ్ ప్రధానమంత్రి సంఘటన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వలస వ్యతిరేక సెంటిమెంట్ ప్రభావంతో జరిపిన కాల్పుల్లో ఎక్కువగా వలసదారులు, శరణార్థులు బలయ్యారని తెలిపారు. తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తులకు న్యూజిలాండ్‌లో స్థానం లేకపోవడంతో తమ ప్రాంతంలో మారణ హోమానికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. ఇదిలావుండగా, పోలీస్ కమిషనర్ మైక్ బుష్ మీడియాతో మాట్లాడుతూ సంఘటనల తర్వాత ఒక కారు నుంచి బాంబు పేలుళ్లకు సంబంధించి రెండు శక్తివంతమైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా, సెంట్రల్ క్రిస్ట్‌చర్చ్‌లోని ఆల్ నూర్ మసీదులో సుమారు ఒంటిగంట 45 నిమిషాలకు జరిగిన మారణ కాండలో కనీసం 30 మంది మరణించి ఉంటారని ప్రత్యక్ష సాక్షి లెన్ పెనేహా తెలిపారు. నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి మసీదులోకి ప్రవేశించి కనిపించినవారిపై కాల్పులకు పాల్పడడంతో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతోమంది పరుగులు తీశారని ఆ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. లిన్‌వుడ్ మసీదులో జరిగిన మరో దాడిలో కనీసం 10 మంది ప్రజలు మరణించారు. ఇక్కడ మసీదులో ప్రార్థనల అనంతరం తిరిగి వస్తున్నవారిపై దుండగుడు కాల్పులకు తెగబడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.