అంతర్జాతీయం

ఆరోగ్యానికి ‘థర్మల్ ’ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, ఫిబ్రవరి 21: భారత దేశంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవని ఓ సర్వేలో స్పష్టమైంది. కార్మికుల ఆరోగ్యానికి సంబంధించినంతవరకు ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయని, అత్యధిక స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా కాలుష్య ఉద్గారాలకు సంబంధించి జరిగిన ఈ అధ్యయనంలో అమెరికా, చైనాలు అత్యధిక స్థాయిలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాలుగా వెల్లడైంది. అంతర్జాతీయంగా వాతావరణ కాలుష్యానికి, విష వాయువులు విసర్జనకు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తే ప్రధాన కారణామని స్విట్జర్లాండ్‌కు చెందిన ఈటీహెచ్ పరిశోధకులు స్పష్టం చేశారు. బొగ్గును మండించడం వల్ల ఉష్ణోగ్రతను పెంచే కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుందని, అలాగే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఉత్పత్తి కావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అనారోగ్యం బారిన పడుతున్నారని అధ్యయనకర్తలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 7861 విద్యుత్ కర్మాగారాల నుంచి పర్యావరణ పరంగానూ, అటు జనారోగ్య పరంగానూ హాని కలిగించే ఉద్గారాల విసర్జన జరుగుతోందని తెలిపారు. తక్షణ ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పరిశోధకులు తమ నివేదికలో ఉద్ఘాటించారు. ప్రపంచంలో అత్యధిక స్థాయిలో థర్మల్ విద్యుత్ అమెరికా, చైనాల నుంచే ఉత్పత్తి అవుతున్నప్పటికీ భారత దేశంలో మాత్రం అత్యధిక స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయని, అనారోగ్య తీవ్రతా పెరిగిపోతోందని తెలిపారు. మధ్య ఐరోపా, ఉత్తర అమెరికా, చైనా దేశాల్లో అత్యధిక విద్యుత్ కార్మాగారాలుంటే తూర్పు ఐరోపా, రష్యా, భారత్‌లో మాత్రం పాత విద్యుత్ కర్మాగారాలే ఇంకా నడుస్తున్నాయని, అరోగ్యాన్ని నివారించే ఆధునిక వ్యవస్థ ఈ కార్మాగారాల్లో లేదని స్ట్ఫినీ హెల్వెగ్ అనే పర్యావరణ శాస్తవ్రేత్త వెల్లడించారు. సరైన పరిమాణంలో ఫ్లూ గ్యాస్ ట్రీట్‌మెంట్ వ్యవస్థ ఈ దేశాల్లో లేకపోవడంవల్ల కొంతమేర మాత్రమే కాలుష్య ఉద్గారాలను నివారించడం సాధ్యమవుతోందని, అలాగే నాసిరకం బొగ్గును మండించడం కూడా ఈ దేశాల్లో ఎక్కువగా జరుగుతోందని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన స్ట్ఫినీ తెలిపారు. పదింట ఒకవంతు విద్యుత్ కర్మాగారాల్లోనే సగానికి పైగా ప్రమాదకర ఆరోగ్య పరిణామాలు సంభవిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ దేశాలు తమ విద్యుత్ కర్మాగారాలను తక్షణ ప్రాతిపదికన ఆధునీకరించాలని, లేనిపక్షంలో వాటిని మూసివేయాలని మరో పరిశోధకుడు కిష్ట్ఫొర్ ఒబెర్‌షెల్ప్ వెల్లడించారు. ధనిక దేశాలు.. ముఖ్యంగా ఐరోపా దేశాలు అత్యంత నాణ్యత కలిగిన ఎక్కువ క్లోరిఫిక్ బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయని, కాని ఇండొనేసియా, కొలంబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు నాసిరకం బొగ్గుతోనే అవసరాలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. భారత్‌తో పోలిస్తే చైనా విద్యుత్ కర్మాగారాలు అత్యంత నాణ్యతాయుతంగా పనిచేస్తున్నాయని, అత్యాధిక ఫ్లూ గ్యాస్ ట్రీట్‌మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల బొగ్గు కర్మాగారాల్లో మరణాలు ఎక్కువగా ఉండడానికి కారణమని వెల్లడించారు. కాలుష్యకారక బొగ్గు కర్మాగారాలను దశలవారీగా పదిశాతం మేరయినా తొలగిస్తే పదహారు శాతం మేర ప్రమాదకర కాలుష్య ఉద్గారాలను నిరోధించవచ్చునని, అలాగే మానవ ఆరోగ్యాన్ని కూడా 64 శాతం మేర పరిరక్షించుకోవచ్చునని వెల్లడించారు.