రాష్ట్రీయం

పారిస్ దాడుల్లో భారతీయులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటలిజెన్స్ దర్యాప్తు
హైదరాబాద్, నవంబర్ 26: ఫ్రాన్స్ రాజధాని పారిస్, ఆఫ్రికాలోని అల్‌మెరాబిట్నర్ హోటల్‌పై జరిగిన దాడుల్లో భారత్‌కు చెందిన ఉగ్రవాదుల హస్తం ఉందా అనే దిశగా ఇంటలిజెన్స్ బ్యూరో దర్యాప్తు సాగిస్తున్నట్టు తెలిసింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులు సహకరించినట్టు కేంద్ర ఇంటెలిజన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లో అరెస్టైన ఓ ఉగ్రవాదిని విచారించగా ఈ సమాచారం బయటకు పొక్కినట్టు తెలిసింది. 16న పారిస్‌లో జరిగిన వరుస దాడుల్లో 180మంది, ఆఫ్రికాలోని ఓ హోటల్‌పై జరిగిన దాడిలో 27మంది మృతి చెందిన విషయం విదితమే. సెప్టెంబర్‌లో దుబాయి నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ఐఎస్ సానుభూతిపరురాలు నిక్కీజోసెఫ్ అలియాస్ అఫ్షాజుబేన్‌ను ఇంటర్నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ అదుపులోకి తీసుకొని విచారించగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు యువతీయువకులకు ఐఎస్‌ఐఎస్‌లో శిక్షణ ఇచ్చిన సంగతి వెల్లడించిన విషయం తెలిసిందే. పారిస్ దాడుల్లో పాల్గొన్న 23మందిలో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారని మిగతావారు ముంబాయికి తిరిగి వచ్చారని నిఘా వర్గాలకు ఉప్పందింది. దీంతో ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.