అంతర్జాతీయం

ఆ రోజు ఏంజరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 9: అసలారోజు ఏం జరిగింది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించినట్టుగా చెబుతున్న ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై వాస్తవాలను కళ్లకుకడుతూ బ్రిటీష్ వెబ్‌సైట్‌లో తాజా వివరాలు వెల్లడయ్యాయి. నేతాజీ మరణంపై ఏర్పాటైన దర్యాప్తు కమిషన్‌కు నలుగురు ప్రత్యక్ష సాక్షులు అందించిన కథనాలు మాత్రం ‘విమాన ప్రమాదం జరిగింది. నేతాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మంటల్లోనే కొద్దిసేపు నిలబడ్డారు. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రికి తరలించాం’ అన్న వౌలిక వివరాలు వీరి మాటల్లో స్పష్టంగా కనిపించాయి. 1945 ఆగస్టు 15న జరిగిన ఆ సంఘటన వివరాలను పదకొండేళ్ల తర్వాత ఈ ప్రత్యక్ష సాక్షులు దర్యాప్తు కమిటీకి వెల్లడించారు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్టుగా చెబుతున్న 1948 ఆగస్టు 15న ఆయనతో ఉన్న ఈ నలుగురి మాటల్ని ఉటంకిస్తూ తాజా డాక్యుమెంట్లు వెలువడ్డాయి. వీటితోపాటు ప్రమాద స్థలానికి సంబంధించి ఆనాటి బ్రిటీష్ ఇంటెలిజెన్స్ నివేదికలను కూడా పొందుపర్చారు. నేతాజీ దేశ భక్తికి, మాతృ దేశానికి దాస్య విముక్తి చేయాలన్న ఆయన ఆశయానికి అద్దంపట్టే రీతిలో చివరి మాటల్ని కూడా ఇందులో ఉటంకించారు. ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం 1948 ఆగస్టు 15 ఉదయం నేతాజీ మరో 12 లేదా 13మంది ప్రయాణికులు, సిబ్బందితో జపాన్ ఎయిర్‌ఫోర్స్ బాంబర్ విమానం వియత్నాంలోని తౌరానే నుంచి బయలు దేరింది. అందులోనే జపాన్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సునామాసా షిడెల్ కూడా ఉన్నారు. హీటో- తైపీ- డైరెన్- టోక్యో మీదుగా ఈ విమానం వెళ్లాల్సి ఉందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు చెబుతున్నాయి.
నేతాజీ మరణ కారణాలను శోధించేందుకు ఇండియన్ నేషనల్ ఆర్పీ (ఐఎన్‌ఎ) మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల కమిటీకి సంఘటన జరిగిన పదకొండేళ్ల తర్వాత వీరు తమ వాగ్మూలం ఇచ్చారు.
‘వాతావరణం సానుకూలంగా ఉంది. విమానం ఇంజన్లలో కూడా ఎలాంటి లోపం లేదు. దానితో హీటోమీదుగా వెళ్లకుండా నేరుగానే తైపీకి వెళ్లాలని పైలట్ నిర్ణయించాడు. ఆ రోజు బాగా పొద్దెక్కిన తర్వాతో లేదా మధ్యాహ్ననికి ముందో విమానం తైపీ చేరుకుంది’ అని ఆ కమిటీకి జపాన్ మైమానిక దళ అధికారి మేజర్ తారో కానో, మరో ప్రయాణికుడు తెలిపారు.
‘మొదట ఇంజను ఎడుమభాగం సరిగా పనిచేయడం లేదని భావించాను. తర్వాత విమానం లోపలికి వెళ్లి పరిశీలించాను. అంతా బాగానే ఉందని స్పష్టమైంది. నేనే కాదు నాతోపాటు విమానాన్ని పరిశీలించిన ఇంజనీరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు’ అని తారోకానో ఆ కమిటీకి నివేదించినట్టుగా తెలుస్తోంది. విమానాశ్రయ నిర్వహణ ఇంజనీరు యమామాటో కూడా విమాన ఇంజను ఎడమ భాగం సరిగా పనిచేయడం లేదన్న మేజర్ తారోతో ఏకీభవించినట్టుగా ఈ పత్రాల్లో ఉంది. రెండుసార్లు పైలట్ తకిజావా ఇంజన్‌ను పరీక్షించారు. కొన్ని మరమ్మతులు చేశాడు. దాంతో ఇంజన్‌లో లోపం లేదని సంతృప్తి చెందాను. మేజర్ తకిజావా కూడా ఈ విషయాన్ని అంగీకరించారు’ అని మేజర్ కానో దర్యాప్తు కమిటీకి చెప్పినట్టుగా తెలుస్తోంది.
‘ఎప్పుడైతే విమానం పైకి ఎగిరిందో... పెద్ద శబ్దం వినిపించింది’ అని నేతాజీ ఎడిసి కల్నల్ హబీబ్ ఉర్ రెహ్మాన్, మరో సహ పాసింజర్ కమిటీకి తెలిపారు. ఈ శబ్దం ఫిరంగి పేల్చినట్టుగా ఉందని కూడా పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని దూరం నుంచి చూస్తున్న గ్రౌండ్ ఇంజనీరు నకమురా ‘విమానం పైకి ఎగిరిన వెంటనే ఎడమ వైపుకు ఒరిగిపోయింది. విమానం నుంచి ఏదో కిందపడిన దృశ్యం కూడా నాకు కనిపించింది. దాన్ని ప్రొపెల్లర్‌గా గుర్తించాను’ అని వెల్లడించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానం 30- 40మీటర్ల ఎత్తులోనే ఉందని కూడా తెలిపారు. కాంక్రీటు రన్‌వేకు వందమీటర్ల దూరంలో కూలిపోయిందని, వెంటనే దాని ముందుభాగంలో మంటలు లేచాయని తెలిపారు.
కల్నల్ రెహ్మాన్ కూడా ఆ నాటి పరిస్థితిని కళ్లకు కట్టారు. ‘ముందు నుంచి వెళ్లండి. వెనుకనుంచి దారి లేదు’ అని నేతాజీ తనతో అన్నట్టు వెల్లడించారు. ‘ముందు భాగం మండుతున్నా.. నేతాజీ ఆ మంటల నుంచే బయటికి వెళ్లారు. నేను కూడా ఆయనతో పాటే బయటికి వచ్చాను’ అని రెహ్మాన్ వివరించినట్టుగా తెలుస్తోంది.
‘నేను బయటికి వచ్చే సరికే నేతాజీ నాకంటే పది గజాల ముందున్నారు. పశ్చిమ దిశగా నిలబడి కనిపించారు. అప్పటికే ఆయన దుస్తులు అంటుకున్నాయి. పరుగెత్తుకెళ్లి బుషర్ట్ బెల్టును తీసేందుకు ప్రయత్నించాను. నేతాజీవి కాటన్ దుస్తులు కాబట్టి అవి తేలిగ్గా అంటుకున్నాయి. వెంటనే నేతాజీని నేలమీద పడుకోబెట్టాను. అప్పటికే అయన తలకు తీవ్ర గాయమైంది. వేడికి ఆయన ముఖం కమిలిపోయింది. జుట్టూ అంటుకు పోయింది’ అని దర్యాప్తు కమిటీకి రెహ్మాన్ తెలిపాడు. తాను తీవ్రంగా గాయపడిన స్థితిలో ఉన్నా నేతాజీ మాత్రం ‘మీకు పెద్దగా దెబ్బలు తగుల లేదుకదా’ అని అడిగినట్టు రెహ్మాన్ తెలిపారు. తాను బతికే అవకాశం లేదని నేతాజీ అన్నట్టు రెహ్మాన్ తెలిపారు. చివరి క్షణం వరకూ దేశ స్వాతంత్య్రం కోసమే పోరాడానని భారత ప్రజలకు చెప్పాలని నేతాజీ తనతో అన్నట్టుగా రెహ్మాన్ వెల్లడించారు. ‘్భరత దేశానికి స్వాతంత్య్రం వచ్చి తీరుతుంది. ఎవరూ భారత్‌ను తమ గుప్పిట్లో పెట్టుకోలేరు’ అన్న ఆయన చివరి మాటల్ని కూడా ఉటంకించారు.
ప్రమాదం జరిగిన తర్వాత నేతాజీ విమానం ఎడమ రెక్క సమీపంలో కనిపించారని, అప్పటికే ఆయన దుస్తులు మండుతున్నాయని, ఆయన సహాయకుడు రెహ్మాన్ ఆయన కోటు విప్పుతున్నట్టుగా కనిపించిందని లెఫ్టినెంట్ కల్నల్ షిరో నానోగాకీ కమిటీకి నివేదించారు. కాగా, రహ్మాన్, నానోగాకి, కోనో, తకాహాషీ, నాకామురాలు ఇచ్చిన వివరాల్లో కొంత వ్యత్యాసం ఉన్నా... విమాన ప్రమాదం జరగడం, నేతాజీ శరీరం అంటుకు పోవడం, ఫలితంగా తీవ్రంగా గాయపడటం వంటివి స్పష్టంగా ఉన్నాయని వెబ్‌సైట్ తెలిపింది. తీవ్రంగా గాయపడిన నేతాజీని సమీపంలోని నాన్‌మోన్ సైనిక ఆసుపత్రికి తరలించారు. 1945లో భారత్‌లోని బ్రిటీష్ అధికారులు నేతాజీ గురించి వాకబు చేయడానికి.. సాధ్యమైతే అరెస్టు చేయడానికి నిఘా బృందాలను బ్యాంకాక్, సైగన్, డావీస్‌లకు పంపారు. కానీ ఆ బృందాలు ప్రమాద వార్తతోనే వెనక్కి వచ్చాయి.