ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంత సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే నోటి నుంచి వెలువడే దుర్వాసన మనకే కాదు, ఇతరులకు సైతం ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని పద్ధతులను పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి సులభంగా గట్టెక్కవచ్చు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో విధిగా దంతధావనం చేయాలి. ఇలా చేస్తే పళ్లమధ్య ఇరుక్కున్న పాచి పదార్థాలు బయటకు పోతాయి. రాత్రి సమయంలో నిద్రపోవడానికి ముందు ‘బ్రష్’ చేయడం అన్ని విధాలా మంచిది. నాలుకపై పేరుకుపోయే పాచి పొరను సుతిమెత్తగా తీయడం అలవాటు చేసుకోవాలి. ‘టంగ్ క్లీనర్ల’ను బలంగా ఉపయోగిస్తే నాలుకపై ఉండే సున్నిత భాగం దెబ్బతింటుంది. నాలుకను సరిగా శుభ్రపరచుకోనపుడు అది బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. రోజూ నాలుగైదు సార్లు నాణ్యమైన ‘వౌత్ వాష్’తో పుక్కిలించి ఉమ్మాలి. ఆహారం తిన్న ప్రతిసారీ నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ధూమపానం, పొగాకు ఉత్పత్తులను నమలడం వల్ల నోటి నుంచి వచ్చే చెడు వాసన ఇతరులను ఇబ్బంది పెడుతుంది. ఇతరులను కలిసేందుకు వెళ్లినపుడు పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి తినకుండా ఉంటే నోటి నుంచి ఘాటైన వాసన రాదు. నోటి శుభ్రతను విధిగా పాటిస్తూ, ఎలాంటి సమస్యలున్నా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి.
*