మెయిన్ ఫీచర్

మేముసైతం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్లను చూస్తేనే ముఖం ముడుచుకుంటాం.. అసహ్యించుకుంటాం.. చిరాకుపడతాం.. చీదరించుకుంటాం.. వాళ్లను తప్పించుకుని వెళ్లిపోవాలని చూస్తాం. వేషధారణ నుంచి అలంకరణ వరకు అంతా ఎబ్బెట్టుగానే వుంటుంది. వాళ్లే హిజ్రాలు!
మేమూ మనుషులమే.. మాకూ మనసుంది.. దానికీ ఓ స్పందనుంది.. మనుషులుగా మమ్మల్ని గుర్తించండి అంటూ ఎలుగెత్తుతున్నారు హిజ్రాలు. నిజానికి ఉత్తర భారతదేశంలో హిజ్రాలకు ఒక ప్రత్యేక స్థానముంది. పెళ్లిళ్ళు, పేరంటాలు వంటి సందర్భాల్లోనే కాకుండా ఇతర అనేకమైన శుభకార్యాల్లో కూడా వీరికి ప్రత్యేక గౌరవం లభిస్తుంది. కాని దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి సరైన గుర్తింపు లభించకపోగా వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించలేకపోతున్నాం. చూడటానికి అసహ్యంగా కనిపించే వీరిలో మానవత్వం కోణం దాగి ఉందనే విషయం మరుగున పడిపోతుంది.
సమాజ సేవలో...
సుప్రీంకోర్టు హిజ్రాలను థర్డ్ జెండర్‌గా గుర్తించిన నేపథ్యంలో తాము సాధించిన విజయానికి మొదటి వార్షికోత్సవం జరుపుకుంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దేశం నలుమూలల నుండి వచ్చిన హిజ్రాలు సమావేశమైన సందర్భంగా సుమారు పదహారువేలమంది హిజ్రాలు తమ కళ్లను దానం చేస్తూ ప్రతిజ్ఞ చేసారట. అలా ప్రతిజ్ఞ చేసిన వారందరూ ఐ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కళ్లను దానం చేయటానికి సిద్ధంగా ఉన్నారు.
ఆమధ్య సికింద్రాబాద్ నుంచి లక్నో వెళ్తున్న సికింద్రాబాద్ గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళ పురిటినొప్పులతో బాధపడుతుంటే తోటి ప్రయాణీకులు కళ్లప్పగించి చూస్తుండిపోయిన నేపథ్యంలో, అదే బోగీలో యాచన చేసుకుంటున్న హిజ్రాలు చూసి ఆ మహిళకు తామే పురుడు పోసి అనంతరం అంబులెన్స్‌ను కూడా పిలిపించి ఆస్పత్రికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ముంబై పబ్లిక్ సర్వీస్, హిజ్రాలతో ‘ది సీట్ బెల్ట్ క్రూ’ పేరుతో ఒక వీడియోను రూపొందించింది. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో వీక్షకులకు అందుబాటులో ఉన్న ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హిజ్రాలు ఎయిర్‌హోస్ట్‌ల మాదిరిగా డ్రెస్ చేసుకొని సీట్ బెల్ట్ పెట్టుకోవలసిన ఆవశ్యకత, ట్రాఫిక్స్ రూల్స్ పాటించాల్సిన అవసరాన్ని చక్కగా వివరిస్తుంటారు. ఇలా సమాజంలో ఒక బాధ్యత కోసం, మార్పు కోసం వారిని ఉపయోగించుకుంటున్నాం కాని దరిచేరనీయటం లేదు.
విజయం వైపు పయనం..
మార్పుకోసం హిజ్రాలు గత కొనే్నళ్ళుగా గట్టిగానే పనిచేస్తున్నారు. పోరాడుతున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించి గత సంవత్సరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హిజ్రాలకు ఒక గొప్ప చేయూతనిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రాలను మూడో కేటగిరీగా (్థర్డ్ జెండర్)గా గుర్తించాలని, విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారిగా గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. హిజ్రాలు కూడా ఈ దేశ పౌరులే కాబట్టి స్ర్తి పురుషులకున్నట్టే వారికి కూడా కొన్ని హక్కులుంటాయని వాటిని గుర్తించాలని పేర్కొంటూ జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.కె.సిక్రీతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో దేశ వ్యాప్తంగా హిజ్రాలందరికీ సరైన విద్య, ఉపాధి, ప్రాథమిక హక్కులు పొందడానికి మార్గం సుగమమయిందని చెప్పవచ్చు.
ప్రజా నాయకులుగా హిజ్రాలు
ఛతీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్, కర్నాటకలోని బళ్లారి వంటి ఎన్నోచోట్ల మేయర్లుగా హిజ్రాలు పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో కూడా తమ పాత్రను పోషిస్తామని నిరూపిస్తున్నారు. ఇక తమిళనాడు రాజకీయాలలో హిజ్రాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు జయలలితకు పోటీగా నిలబడి సంచలనం సృష్టించింది ట్రాన్స్‌జెండర్ రవి. ఇవే కాదు ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్‌ల కోసం యాడ్ ఏజెన్సీలు వెలిశాయి. వారికి శిక్షణ ఇస్తే వ్యాపార ప్రకటనల్లో చక్కగా రాణించగలరని గుర్తించిన కొన్ని యాడ్ ఏజెన్సీలు వీరిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి.

తొలి
ప్రిన్సిపాల్

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమించబడి రికార్డు సృష్టించారు మనాబీ బందోపాధ్యాయ. మనాబీ ఉన్నత విద్యావంతురాలు. సంగీత, సాహిత్యాలలో మంచి పట్టు సాధించిన వ్యక్తి. బెంగాలీ సాహిత్యంలో పిహెచ్‌డి చేశారు. కథాకళి, భరత నాట్యాలను కూడా అభ్యసించారు. పత్రికలలో కాలమ్స్ నిర్వహించడమే కాకుండా అమానవ్ అనే పత్రికకు సంపాదకురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. సాంగ్ అనే నాటక సమాజాన్ని స్థాపించి హిజ్రాల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా నాటక రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తుంటారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడిన ట్రాన్స్‌జెండర్ డెవలప్‌మెంట్ బోర్డుకు వైస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న మనాబీ బెంగాల్‌లోని నదియా జిల్లా కృష్ణానగర్ మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఎన్నికయ్యారు.

తొలిన్యూస్‌రీడర్

పద్మినీ ప్రకాష్.. ఒకప్పుడు కన్నీళ్లకు కడగండ్లకు కేరాఫ్ ఎడ్రస్. మరిప్పుడు.. ఒక విజయానికి మారుపేరు. పోరాడి సాధించిన గెలుపునకు గుర్తింపు. 2000 సంవత్సరంలో ఇంటినుంచి బయటపడిన పద్మిని న్నో బాధలనోర్చుకొని పోరాడింది. చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఎంతో కష్టపడి నాట్యం నేర్చుకుంది. ఎన్నో ఒడిదుడుకులను, ఛీత్కారాలను భరించి పయనం సాగించిన పద్మిని 2004లో ఆపరేషన్ చేయించుకొని స్ర్తిగా మారిపోయింది. 2009లో ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కంటెస్ట్‌లో విజయం సాధించిన పద్మిని ప్రకటనలలోను, టీవీ సీరియల్స్‌లోను నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. చివరికి పద్మినీ టేలెంట్‌ను గుర్తించిన కోయంబత్తూరుకు చెందిన లోటస్ న్యూస్ ఛానల్ పద్మినికి పిలిచి అవకాశాన్నిచ్చింది. అలా పద్మిని తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ రీడర్‌గా మారింది.

తొలిఎస్‌ఐ

ప్రీతికా యాషిని ట్రాన్స్‌జెండర్ ఎస్‌ఐ. తమిళనాడుకు చెందిన ప్రీతిక ఈ ఉద్యోగాన్ని పొందడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. గత సంవత్సరం ఎస్‌ఐ పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకున్న ప్రీతిక దరఖాస్తు, ఆమె ట్రాన్స్‌జెండర్ అన్న కారణంగా తిరస్కరించారు. దాంతో మేమూ మనుషులమే కదా, మాకు మాత్రం ఉద్యోగానికి అర్హత ఎందుకు లేదంటూ ఆమె న్యాయపోరాటానికి దిగింది. తనకు తగిన న్యాయం చెయ్యాలంటూ న్యాయస్థానం మెట్లెక్కింది. ఈమె వాదనను సమర్థించిన న్యాయస్థానం ప్రీతికకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో తను కోరుకున్న ఉద్యోగానికి అర్హతను సాధించడంతోపాటు ఇకమీదట పోలీస్ ఉద్యోగాలకు జారీచేసే నోటిఫికేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు కూడా వచ్చేలా చేసింది.

-మావూరు విజయలక్ష్మి