ఐడియా

మెనోపాజ్‌కు విరుగుడు సోయాబీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెనోపాజ్ స్థితికి చేరుకున్న మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ కారణంగా, అటువంటి స్ర్తిలలో మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. శరీరంలో వెచ్చని ఆవిర్లు రావడం, చెమట పట్టడం, ఎముకల పటిష్టత తగ్గిపోయి ఆస్టియో పోరోసిస్ అనే ఎముకల వ్యాధికి గురవటం లాంటి ఇబ్బందులు శారీరకమయితే, అశాంతి, కోపం, చికాకు, డిప్రెషన్, మూడ్స్ మారిపోతూండటం లాంటి లక్షణాలు మానసికమయినవి. వాటిని తొలగించుకోవటానికి సోయాబీన్ ఎంతగానో తోడ్పడతాయి.
వైద్యశాస్తజ్ఞ్రుల పరిశోధనల ద్వారా సోయాబీన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా రక్షణగా పనిచేస్తుందని తేలింది. అంతేకాకుండా, గుండె జబ్బులు రాకుండా కాపాడుతోంది. యూట్రస్, బ్రెస్ట్ కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. సోయాబీన్, సోయాబీన్‌లో అత్యధికంగా లభించే ప్రొటీన్స్ మెనోపాజ్ స్థితికి చేరుకున్న స్ర్తిల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. మెనోపాజ్ ఇబ్బందులను హరిస్తాయి.
ఆరు వారాలపాటు ప్రతిరోజూ 20 గ్రాముల సోయాబీన్స్ పొడిని ఆరెంజ్ జ్యూస్‌లో కలిపి లేదా కాన్‌ఫ్లెక్స్‌మీద ఆ పొడిని చల్లి తీసుకున్నట్లయితే, మరొక ఆరు వారాల పాటు వారి శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. సోయాబీన్ పాలను కూడా తాగవచ్చు. మెనోపాజ్ స్థితికి చేరుకున్న స్ర్తిలు తమ ఆహార పదార్థాల్లో సోయాబీన్స్‌ను చేర్చడం మంచిది. ఎముకల ఆరోగ్యాన్ని, పటిష్టతనూ పెంచవచ్చు. సోయాబీన్‌ను తీసుకోవడంవల్ల ఇతర మెనోపాజ్ లక్షణాలు తొలగిపోతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయిన స్ర్తిలు సోయామీన్‌ను ఏ రకంగా తీసుకున్నా వారి ఆరోగ్యానికి మంచిదే.

- కె.నిర్మల