ఐడియా

మొండి మరకైనా మటుమాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గృహ సంబంధ చిట్కాలకు వెనిగర్‌ని వాడతారు. దీనిని వంటల్లో వాడడంతో ఆయా ఆహార పదార్థాలకు చక్కని రుచి, సువాసనలు చేకూరుతాయి. వెనిగర్‌లో పలు రోగ నిరోధక, నిర్మూలన శక్తులున్నాయి.
-స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ కలిపితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చర్మం మెరుపులీనడమే కాక చెమట దుర్వాసనను దరిచేరనివ్వదు.

-మసకబారిన డ్రెస్సింగ్ టేబుల్ అద్దం, షోకేసు- ఏ ఇతర అద్దమైనా కాస్త వెనిగర్‌తో రుద్ది తెల్లని పొడి బట్ట లేదా టిష్యూ పేపర్‌తో తుడుచుకుంటే సరిపోతుంది. ఎంతటి మొండి మరకనైనా మాయం చేసి కాంతులీనుతాయి.
-రాగి, ఇత్తడి వస్తువులు తరచూ మరకలు పడి ఇబ్బంది పెట్టడం సహజం. వెనిగర్‌ని ప్రయోగించి చూడండి. ఇక వస్తువులన్నీ తళతళ మెరవాల్సిందే.
-తరచూ నూనెలు కాగే బాండీలు మసి పట్టడం, లోపల, అంచుల్లో జిడ్డు చేరడం జరుగుతుంది. వీటికి వెనిగర్‌ని చుట్టూ పట్టించి పూర్తిగా ఆరిపోయాక తోమితే కొత్త పాత్రలేమోనని అనుమానం కలుగకమానదు.
-జరీ అంచు ఉన్న చీరలు, సిల్క్ చీరలు ఉతికి శుభ్రంగా నీళ్ళలో జాడించాక కొన్ని చుక్కలు వెనిగర్ వేసిన నీటిలో ముంచి తీస్తే సరి. చీరలకు చక్కని షైనింగ్ చేకూరుతుంది.
-కడుపులో మంట, ఆయాసం, అజీర్తి, ఆకలి లేకపోవడం, విరోచనాలు- ఇత్యాది సమస్యల నివృత్తికి ఒక టేబుల్ స్పూన్ తేనెతో అరస్పూన్ వెనిగర్ కలిపి తీసుకోవాలి.
-వాంతులు అరికట్టడానికి, కడుపులో వికారం దూరం చేయడానికి ఒక గ్లాసు మంచినీళ్లలో అరస్పూను వెనిగర్ బాగా కలిపి పుచ్చుకుంటే సరిపోతుంది.

-మురళీకృష్ణ.ఎం.