రుచి

చిరుతిళ్లకు రుచి.. ఒంటికి ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్కువ ధరకు దొరికే పామాయిల్‌ని చిన్నచూపు చూడకండి. ఎన్నో రకాల పోషకాలతోపాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లతోపాటు కేన్సర్, బి.పి వంటి జబ్బుల్ని తగ్గించే విటమిన్ ఇ ఇందులో సమృద్ధిగా లభిస్తుంది. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగిన మోతాదులో వుంటూ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరకుండా సహాయపడుతుంది. గుండె జబ్బుల విషయంలో ఆరోగ్యా న్ని మెరుగుపరచటంతోపాటు ఇతర శాచురేటెడ్ ఆయిల్స్‌కన్నా సురక్షితంగా వుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోకెల్లా మలేషియా దేశంలో దీని ఉత్పాదన ఎక్కువ. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచటంతోపాటు శక్తిని ప్రసాదించే గుణం వుంది కనుక దీనిని విరివిగా వాడుతున్నారు. మార్కెట్లలో తయారయ్యే ఆలూ చిప్స్ లాంటి స్నాక్స్, కేక్‌మిక్స్ లాంటి బేకరీ పదార్థాలు, నూడుల్స్, మంచూరియా.. తదితర పదార్థాలు ఎక్కువ శాతం పామాయిల్ ఉపయోగించి చేసేవే. రుచి, వాసన లేకపోవటంతో వివిధ రుచుల వంటకాల తయారీకి అనుగుణంగా వుంటుంది. తక్కువ ధరకే లభించే పామాయిల్‌ని తగిన పద్ధతిలో వాడి ఎలాంటి భోజనాన్నయినా సమతుల్య ఆహారంగా మలుచుకోవచ్చనేది నిపుణులు చెప్పేమాట. బిస్కెట్స్, కేక్స్ వంటి నిల్వ పదార్థాల తయారీకి నిరభ్యంతరంగా వాడి సత్ఫలితాలు పొందవచ్చు.