ఐడియా

స్వెట్టర్ల అల్లిక.. విజయాల మల్లిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిజోరాంలో షాల్స్, స్వెట్టర్లు అంటే లాల్‌ఫకౌజాలీ పేరునే అందరూ చెప్పుకునే స్థాయికి ఆమె చేరుకుంది. ఒకప్పుడు భర్త నిరాదరణకు గురై బతుకు చాలించాలని అనుకున్న లాల్‌ఫకౌజాలీ నేడు తాను, తన కుటుంబం బతుకుతూ మరికొందరికి బతుకునిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

మిజోరాంకి చెందిన లాల్‌ఫకౌజాలీ చేజారిపోతున్న జీవితాన్ని ఒడుపుగా ఒడిసి పట్టుకుని విజయ పథాన దూసుకుపోతున్న మహిళ. అందరు ఆడపిల్లల్లాగే ఆమె కూడా పెళ్లిమీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మంచి భర్త తోడునీడలో తన జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకుంది. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే భర్త చూపించిన నరకం జీవితం పట్ల విరక్తిని కలిగించింది. శారీరకంగా, మానసికంగా చిత్రహంసలకు గురిచేస్తున్నా.. ఆరళ్లను పంటి బిగువన భరిస్తూ వచ్చిందామె. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒక కొడుకు పుట్టాడు. పసిగుడ్డును చూసైనా ఆ మానవ మృగం ఆగడాలు తగ్గకపోగా..మరీ మితిమీరిపోయాయి.
ఇక ఒక్క క్షణం కూడా అతని దాష్టీకాలను భరించగలిగే ఓపిక ఆమెలో లేకపోయింది. పైగా అత్తింట ఆదరించేవారు ఒక్కరు కూడా లేకపోయారు. కన్నపేగు కోసం జీవించాలనే ఆశను ప్రోది చేసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో భర్తని విడిచిపెట్టి పుట్టింటికి చేరుకుంది. పెళ్లికి ఎదిగిన మరో నలుగురు ఆడపిల్లలతో ఉంటున్న తల్లిదండ్రులు ఆమెను ఏమీ అనకుండా కడుపులో దాచుకున్నారు.
ఆదరించిన తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. దాంతో లాల్‌ఫకౌజాలీ, ఆమె కొడుకుతోపాటు ఆమె నలుగురు చెల్లెళ్ళు కూడా అనాథలైపోయారు. ఆ సమయంలో అందరి బాధ్యత ఇంటికి పెద్దదైన లాల్‌ఫకౌజాలీపై పడింది. అంత పెద్ద సంసారాన్ని ఈదడం అంత సులభం కాదని ఆమెకి అర్థం అయింది. వ్యవసాయం ద్వారా వచ్చే కొద్దిపాటి రాబడితో అంతా గుట్టుగా జీవించడం మొదలుపెట్టారు. లాల్‌ఫకౌజాలీ తన కొడుకుని అక్కడే ఒక పాఠశాలలో చేర్పించి చదివించసాగింది. అయితే లాల్‌ఫకౌజాలీకి ఆ సమయంలో కూడా కలిసి రాలేదు.
ఏం చేయాలా అని రాత్రీ పగలు ఆలోచించింది. అప్పుడామెకి ఒక ఆలోచన తట్టింది. షాల్స్, స్వెట్టర్లు అల్లి విక్రయించడం మొదలుపెడితే ఇల్లు గడుస్తుందని అనిపించింది. ఎందుకంటే ఆ పని ఆమెకి పెళ్లి కాకముందు నుండి తెలుసు. ఏమీ చేయకుండా బాధపడేకంటే ఏదో ఒకటి చేసి ఫలితం ఆశించడం మంచిదని ఆమెకి అనిపించింది. వెంటనే అందుకు కావలసిన స రంజా మా బజారుకెళ్లి తెచ్చుకుంది. ఓపిగ్గా షాల్స్, స్వెట్టర్లు అల్లింది. ఆమె చెల్లెళ్లు వాటిని మార్కెట్‌కి తీసుకెళ్లి విక్రయించడానికి సిద్ధపడ్డారు.
తొలుత వారి షాల్స్, స్వెట్టర్ల వైపు ఎవరూ చూడనైనా చూడలేదు. అయినా లాల్‌ఫకౌజాలీ నిరాశపడలేదు. వ్యాపారం అన్నాక ఓపిక వుండాలని అనుకుంది. చెల్లెళ్లని ప్రోత్సహించింది. వారు అయిష్టంగానే మరికొన్ని రోజులు షాల్స్, స్వెట్టర్లు తీసుకుని బజారుకి వెళ్లారు.
అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకటి రెండు అమ్మకాలు జరిగాయి. ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జించేయాలనే వ్యాపారుల పోకడతో కాకుండా మనసు పెట్టి నేసినవి కావడంవల్ల రంగు, మన్నిక కలిగిన ఆ షాల్స్, స్వెట్టర్లు కొనుగోలుదారుల ఆదరణను చూరగొని వ్యాపారం పుంజుకుంది. దాంతో లాల్‌ఫకౌజాలీ షాల్స్, స్వెట్టర్ల నేత వేగం పెంచింది. వాటిని ఆమె చెల్లెళ్లు మార్కెట్‌లో విక్రయించుకురావడం కూడా సులభమయింది. ఆ తర్వాత మిజోరాంలోనే కొందరు హోల్‌సేల్ వ్యాపారులు లాల్‌ఫకౌజాలీ షాల్స్, స్వెట్టర్ల క్వాలిటీని గమనించి కమీషన్‌మీద విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దాంతో లాల్‌ఫకౌజాలీ వ్యాపారం ఒక్కసారిగా స్పీడందుకుంది. లాల్‌ఫకౌజాలీ చెల్లెళ్లకి కూడా నేత పని నేర్పించింది. మరో నలుగురు ఆడవాళ్లని పనిలో పెట్టుకుని, వారికి కూడా పని నేర్పి ఉపాధి కల్పించింది.
అలా మూడేళ్లు గడిచేసరికి మిజోరాంలో షాల్స్, స్వెట్టర్లు అంటే లాల్‌ఫకౌజాలీ పేరునే అందరూ చెప్పుకునే స్థాయికి ఆమె చేరుకుంది. ఒకప్పుడు భర్త నిరాదరణకు గురై బతుకు చాలించాలని అనుకున్న లాల్‌ఫకౌజాలీ నేడు తాను, తన కుటుంబం బతుకుతూ మరికొందరికి బతుకునిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

-లావణ్య