ఐడియా

హెర్బల్ టీతో గుండెపోటుకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో టీ తాగటం ఓ అంతర్భాగమైపోయింది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ తాగటానికి ఉత్సాహం చూపిస్తాం. కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో, స్నేహితులకు కంపెనీ ఇవ్వటానికో టీ తాగడం మామూలే. చాలామంది రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు. ఇన్నిసార్లు టీ తాగకపోయినా రోజుకు రెండు మూడుసార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదనే వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టీవల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని అంటున్నారు. హెర్బల్ టీ తాగటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపోడుకోవచ్చు. హెర్బల్ టీలో రకరకాల వనమూలికలు కలిపి ఉంటాయి. దీనిని సేవించడం వల్ల శరీరంలో ఉన్న ఎన్నో రుగ్మతలు దూరవౌతాయంటున్నారు వైద్యులు. మొక్కల ఆకులు, వేళ్లు, పళ్లు, పూవులు, కాయలు ఇతర చెట్టు భాగాలు హెర్బల్ టీ తయారీలో ఉపయోగిస్తారు. దీంతో దీనిని సేవించటం వల్ల హృదయం పదిలంగా ఉంటుంది. గుండెపోటును నిరోధిస్తుంది. జీర్ణక్రియలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఇది శరీరంలో ఉన్న మలినాలను విసర్జించేలా చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు.